మరో మారు విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు

టీడీపీ మరియు వైసీపి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు మధ్య వ్యవహారం రోజురోజుకీ ముదురుతుంది.

ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసిపి ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాప్ చేస్తుందని ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసిన విషయం అందరికీ తెలిసిందే.

ఇక తాజాగా వైసీపి రెబల్ ఎంపీగా తనని తాను ప్రొజెక్ట్ చేసుకుంటున్న రఘురామకృష్ణం రాజు పార్క్ హయత్ హోటల్‌లో నిమ్మగడ్డ రమేశ్, కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి సమావేశం అయిన అంశాన్ని ఇప్పుడు ప్రస్తావిస్తూ.అప్పట్లో రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ఓ ట్వీట్‌ను గుర్తు చేశారు.

RaghuramKrishnamRaju Latest Comments On Ycp, Raghuramakrishnam Raju, YSRCP, Vij

దుష్ట చతుష్టయం అంటూ అలాగే ఫేస్ టైమ్‌లో మాట్లాడిన నాలుగో బిగ్ బాస్ ఎవరని విజయసాయి ట్వీట్ చేశారు.మొత్తం విని కూడా మళ్లీ ఇలా వారి గురించి వ్యంగ్యంగా ట్వీట్స్ చేయడం ఏంటి?అంటూ ఆయన అధికార పార్టీని ప్రశ్నించారు.జగన్ తన ప్రభుత్వానికి మచ్చ రాకూడదని తన హయాంలో ఎవరు తప్పు చేసినా దాన్ని కవర్ చేసుకుంటూ వస్తున్నారని విమర్శించారు.

ఫోన్ టాపింగ్ విషయంలో వెంటనే నిందితుల్ని గుర్తించి వారిని శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement
వైరల్ వీడియో.. అరె పిల్లలు అది డాన్స్ ఫ్లోర్ కాదరయ్యా.. క్రికెట్ మ్యాచ్!

తాజా వార్తలు