సీఐడీ అధికారికి నోటీసులు పంపించిన రఘురామకృష్ణంరాజు..!!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీఐడీ తనని అరెస్టు చేసిన సమయంలో ఫోన్ తీసేసుకున్నరని దానిలో విలువైన సమాచారం ఉందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా రఘురామకృష్ణం తరపు న్యాయవాది ఏపీ సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ కు లీగల్ నోటీసులు ఇచ్చారు.

 Raghuramakrishnam Raju Sends Notices To Ap Cid  Raghuramakrishnam Raju, Ap Cid ,-TeluguStop.com

ఏపీ సీఐడీ మరికొంత మంది పోలీసులు రఘురామకృష్ణంరాజును అరెస్టు చేసిన సమయంలో విలువైన వస్తువులు తీసుకుని ఇవ్వలేదని నోటీసులో పేర్కొన్నారు.తీసుకున్న ఐఫోన్ రికార్డుల్లో ఎక్కడా కూడా చూపించలేదని ఆరోపించారు.

అంతేకాకుండా విచారణ సమయంలో కస్టడీలో తనని హింసించి తన సెల్ ఫోన్ పర్సనల్ కోడ్ ఓపెన్ చేయాలని అనేక ఇబ్బందులకు సిఐడి పోలీసులు గురి చేసినట్లు తెలిపారు.పార్లమెంటులో స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పార్లమెంటు విధులు నిర్వర్తించేందుకు వీలుగా తిరిగి తన ఫోన్ ఇచ్చేయాలని నోటీసులో రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు ఏ మాత్రం  ఫోన్ ఇవ్వకుండా ఇబ్బందుల పాలు చేస్తే సివిల్ , క్రిమినల్ చర్యలు ఉంటాయని రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో మంగళగిరి సిఐడి హెచ్ఎస్ఓకు లీగల్ నోటీసులిచ్చారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube