Chandramukhi 2 : చంద్రముఖి2 కథ లీక్ చేసేశారుగా.. ఈ సినిమాలో థ్రిల్ చేసే అసలు ట్విస్టు ఇదేనంటూ? 

దాదాపు 15 సంవత్సరాల క్రితం పి.వాసు( P.Vasu ) దర్శకత్వంలో రజనీకాంత్( Rajinikanth ) నయనతార ప్రభు, జ్యోతిక వంటి వారు ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం చంద్రముఖి ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం ద్వారా దర్శక నిర్మాతలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

 Raghava Lawrence Chandramukhi 2 Story Leaked Details Inside-TeluguStop.com

అయితే ఈ సినిమాలో రజనీకాంత్ స్థానంలో లారెన్స్( Lawrence ) నటిస్తున్నారు.అలాగే జ్యోతిక స్థానంలో బాలీవుడ్ నటి కంగనా ( Kangana ) నటిస్తున్నారు.

Telugu Bollywood, Chandramukhi, Jyothika, Kangana Ranuth, Rajinikanth, Tollywood

ఈ సినిమా సెప్టెంబర్ 15వ తేదీన విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.ఇక ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.ఈ క్రమంలోనే చిత్ర బృందం తాజాగా ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా కంగనా లారెన్స్ ఇద్దరు కూడా ఈ సినిమా స్టోరీ మొత్తం లీక్ చేసేసారు.

ఇక వీరిద్దరి మాటలను బట్టి చూస్తే ఈ సినిమాలో హైలెట్ అయ్యే పాయింట్ చిన్న క్లూ ద్వారా బయటపడిపోయింది.

Telugu Bollywood, Chandramukhi, Jyothika, Kangana Ranuth, Rajinikanth, Tollywood

చంద్రముఖి( Chandramukhi ) సినిమాలో జ్యోతిక ( Jyothika ) ప్రధాన పాత్రలో నటించలేదు కేవలం ఆమె శరీరంలోకి చంద్రముఖి ఆవహించినప్పుడు మాత్రమే తాను నాట్యం చేస్తూ, రాజు పై ప్రతీకారం తీర్చుకునే లాగా కనిపిస్తుంది.కానీ సీక్వెల్స్ సినిమాలో మాత్రం అసలైన చంద్రముఖిని చూపించబోతున్నారని ఆ అసలైన చంద్రముఖినే కంగనా అంటూ వీరి మాటలు బట్టి తెలిసిపోయింది.కనిపించని దెయ్యంగానే అంత భయపెడితే ఇప్పుడు ఏకంగా నిజంగానే బంగాళాకు వస్తే జరగబోయే పరిణామాల నేపథ్యంలో కొనసాగింపుగా ఈ సినిమా సీక్వెల్ చిత్రం ఉండబోతుందని తెలుస్తోంది.

మరి ఈ సినిమా కూడా చంద్రముఖి స్థాయిలోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేక రజనీకాంత్ సినిమాని ముందుకు నడిపించినంతగా లారెన్స్ ఈ సినిమాని ముందుకు నడిపిస్తారా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube