Radisson Drugs Case : రాడిసన్ డ్రగ్స్ పార్టీ కేసు: హైకోర్టుకు దర్శకుడు క్రిష్..!!

హైదరాబాద్ రాడిసన్ డ్రగ్స్ పార్టీ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది.సినీ డైరెక్టర్ క్రిష్( Director Krish ) హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

 Radisson Drugs Party Case Director Krish To High Court-TeluguStop.com

పోలీసుల విచారణకు ఇవాళ వ్యక్తిగతంగా హాజరు అవుతానని క్రిష్ రెండు రోజుల కిందట సమాచారం అందించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఆయన విచారణను హాజరుకాకుండా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అయితే క్రిష్ తప్పనిసరిగా విచారణకు హాజరు కావాల్సిందేనని గచ్చిబౌలి పోలీసులు చెబుతున్నారని తెలుస్తోంది.కాగా రాడిసన్ డ్రగ్స్ పార్టీ( Radisson Drugs Case ) కేసులో డైరెక్టర్ క్రిష్ ఏ10 గా ఉన్నారు.ఫిబ్రవరి 24న జరిగిన డ్రగ్స్ పార్టీలో దర్శకుడు క్రిష్ పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ క్రమంలోనే నిర్భయ్ సింది, వివేక్ తో కలిసి క్రిష్ కూడా డ్రగ్స్ తీసుకున్నారని తెలుస్తోంది.

డ్రగ్స్ పార్టీ జరిగిన ప్రతిసారి రాడిసన్ హోటల్ లో క్రిష్, నిర్భయ్ కలుసుకున్నట్లు పోలీసులు గుర్తించారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube