ఒకప్పటి హీరోయిన్ సీనియర్ నటి అయిన రాధిక శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అప్పట్లో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.
అప్పట్లో టాప్ హీరోయిన్ ల సరసన నటించి హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.ఆ తరువాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం రాధిక తల్లి పాత్రలో కూడా నటిస్తోంది.ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ రాధిక కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చిన విషయం అందరికి తెలిసిందే.
ఇద్దరు జంటగా కలిసి నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.ఇకపోతే ప్రస్తుతం సినిమాలలో తల్లి పాత్రలో నటిస్తున్న రాధిక మెగాస్టార్ చిరంజీవి సినిమాలో విలన్ గా నటిస్తాను కానీ ఆయనకు తల్లిగా మాత్రం నటించను అని ఇటీవల కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేసింది రాధిక.
ఇదిలా ఉంటే తాజాగా ఒక షోకు హాజరైన రాధిక షోలో మాట్లాడుతూ ఒక సినిమాలో చిరంజీవి ని కొట్టాను అని చెప్పుకొచ్చింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ.న్యాయం కావాలి సినిమా తన జీవితంలో లైఫ్ టర్నింగ్ పాయింట్ అని తెలిపింది.ఆ సినిమాలో చిరంజీవి ని కొట్టి కొట్టి మాట్లాడే సన్నివేశం ఉంటుంది అని, దానిని 23 టేక్స్ తీసుకున్నాను అని చెప్పుకొచ్చింది రాధిక.

ఆ సన్నివేశం పూర్తి అయిన తర్వాత చిరంజీవి ముఖం చూస్తే మొత్తం రెడ్ కలర్ గా మారిపోయింది అని తేలిపోయింది.ముఖం ఎర్రబడే విధంగా అంత గట్టిగా కొట్టాను అని తెలిపింది.ఇకపోతే ఇండస్ట్రీలో హీరోయిన్ గా,తర్వాత తల్లి పాత్రలు చేయాలనే ఫార్మాటు ఉంది.దానిని ఫాలో అవ్వడం నాకు ఇష్టం లేదు అని చెప్పుకొచ్చింది రాధిక.అందుకే బుల్లితెరపై సీరియల్స్ లో నటించాను అని తెలిపింది రాధిక.ఇకపోతే రాధికా ఇటీవలే విడుదల అయిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో ముఖ్య పాత్రలో నటించిన విషయం తెలిసిందే.