ఆ విషయంలో బాగా మారానంటున్న రాధికా ఆప్టే..?

టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు రాధికా ఆప్టే.

బాలకృష్ణ, రజనీకాంత్ లాంటి సీనియర్ స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించి సౌత్ ఇండియా అంతటా పాపులారిటీ సంపాదించుకున్నారు.

ఒకవైపు గ్లామరస్ పాత్రల్లో నటిస్తూనే మరోవైపు అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ కెరీర్ విషయంలో ముందడుగులు వేయడం రాధికా ఆప్టే ప్రత్యేకత.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో సినిమాల ఎంపిక గురించి మాట్లాడుతూ రాధికా ఆప్టే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తున్న రాధిక గతేడాది లాక్ డౌన్ సమయంలో తన గురించి తనకు బాగా అర్థమైందని తెలిపారు.లాక్ డౌన్ సమయంలో సినిమాల ఎంపిక విషయంలో మారానని రాధికా ఆప్టే చెప్పుకొచ్చారు.

లాక్ డౌన్ లో తాను కొన్ని నిర్ణయాలను తీసుకున్నానని ఆ నిర్ణయాలను ఇప్పుడు అమలు చేస్తున్నానని రాధికా ఆప్టే పేర్కొన్నారు.

Advertisement

ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్న రాధిక గతంలో సినిమా కథ నచ్చినా నచ్చకపోయినా ఓకే చెప్పకపోతే ప్రాజెక్ట్ మిస్ అవుతుందని భావించేదాననినని అన్నారు.కొన్నిసార్లు భయంతో, కొన్నిసార్లు ఇన్ సెక్యూరిటీ వల్ల కొన్ని సినిమాల్లో నటించానని అలాంటి సినిమాలు విజయం సాధించినా సాధించకపోయినా సంతృప్తి మాత్రం కలగదని రాధికా ఆప్టే వెల్లడించారు.ఇకపై మాత్రం అలా చేయనని నచ్చకపోతే ఆ సినిమాల్లో నటించడానికి అంగీకరించనని రాధిక స్పష్టం చేశారు.

ఇతరులు ఎక్కువ సినిమాల్లో నటిస్తున్నారని మనం మనపై ఒత్తిడి పెంచుకోకూడదని రాధిక చెప్పుకొచ్చారు.నచ్చని సినిమాలకు నో చెప్పాలని నిర్ణయం తీసుకున్నానని ఇకపై అదే విధంగా ముందుకెళతానని రాధికా ఆప్టే సినిమాల గురించి కామెంట్లు చేశారు.

రాధికా ఆప్టే తీసుకున్న నిర్ణయం సరైనదే అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు