‘రక్త చరిత్ర’, ‘లెజెండ్’ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన రాధిక ఆప్టే ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సత్యదేవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లయన్’ సినిమాలో రెండవ హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ అమ్మడు తాజాగా హీరోయిన్‌ల డ్రెస్‌లపై వింత కామెంట్స్ చేసి వివాదాస్పదం అయ్యింది.
పుట్టినప్పుడు, చనిపోయినప్పుడు లేని బట్టల గురించి మధ్యలో రాద్దాంతం ఎందుకు అంటూ ప్రశ్నిస్తోంది.చిన్న డ్రెస్ వేసుకున్నారు, తొడలు కనిపించేలా డ్రస్ ఏంటి అంటూ ఆడవారి డ్రెస్‌లపై ఎందుకు వివక్ష చూపుతున్నారు అంటూ రాధిక ఆప్టే అంటోంది.
తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను రాధిక చెప్పుకొచ్చింది.ఈమె బాత్ రూం ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.
నగ్నంగా ఈమె సెల్పీ దిగి, స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని అంటున్నారు.సినిమాల్లో నగ్నంగా కనిపించడం తప్పుకాదనేది తన అభిప్రాయం అంటూ కుండ బద్దలు కొట్టింది.
అందాల ఆరబోత విషయంలో తాను ఎప్పుడు కూడా అడ్డు చెప్పను అని, ఇతరుల విమర్శలను తాను పట్టించుకోను అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.ఈమె వ్యాఖ్యలపై హిందుత్వ వాధులు మరియు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.







