తూచ్.. క్యాన్సిల్ కాలేదంటున్న డార్లింగ్ డైరెక్టర్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్రస్తుతం షూటింగ్‌ను శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే.జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రానుంది.

 Radhakrishna Gives Clarity On Prabhas20 Shoot Cancelled-TeluguStop.com

ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త లుక్‌లో మనకు కనిపిస్తాడని తెలుస్తోంది.అందుకే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఎలాంటి వార్తలను బయటకు రాకుండా చూస్తున్నారు.

కాగా ఇటీవల జార్జియాలో షూటింగ్ నిమిత్తం ఈ చిత్ర యూనిట్ అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే.అయితే ప్రపంచాన్ని కరోనా వైరస్ భయపెడుతున్న కారణంగా ఆ దేశంలో చిత్ర షూటింగ్‌లను వెంటనే క్యాన్సిల్ చేసింది అక్కడి ప్రభుత్వం.

దీంతో ప్రభాస్ 20 చిత్ర యూనిట్ తిరిగి వచ్చేసిందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.వీటిపై చిత్ర దర్శకుడు రాధాకృష్ణ క్లారిటీ ఇచ్చాడు.

ప్రభాస్ 20 చిత్ర యూనిట్ జార్జియాలో షూటింగ్‌ను అనుకున్న సమయానికంటే ముందే ముగించుకుని తిరిగి వచ్చిందని ఆయన తెలిపాడు.చిత్ర షూటింగ్ క్యాన్సిల్ అయ్యిందనే వార్త కేవలం పుకారు మాత్రమే అని ఆయన అన్నారు.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే.గోపీకృష్ణా పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube