తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ రాశి ఖన్నా( Heroine Rashi Khanna ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మొదట ఊహలు గుసగుసలాడే సినిమాతో సినిమా ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయింది.
అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.తెలుగులో వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నాగశౌర్య, రామ్ పోతినేని, రవితేజ, గోపీచంద్ లాంటి హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అయితే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఈమెకు అవకాశాలు వరుసగా క్యూ కట్టాయి.

కానీ రాను రాను అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.అయితే ఈమె ఇన్ని సినిమాలలో నటించినప్పటికీ ఆమె ఇస్తారు హీరోయిన్గా రాణించకపోవడానికి కారణం ఉంది.అదేమిటంటే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించడంతో ఏ భాషలోనూ సరిగా దృష్టి సారించకపోవడం కారణం కావచ్చు.
రాశీఖన్నా తమిళంలో నటించిన తొలి చిత్రం ఇమైకా నొడిగళ్.నటి నయనతార ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.తరువాత అడంగ మరు, ధనుష్ హీరోగా నటించిన తిరుచిట్రం ఫలం( Thiruchitram palam ), కార్తీకి జంటగా సర్ధార్( Sardhar ) చిత్రాల్లో నటించింది.కాగా తాజాగా ఈమె కథానాయకిగా నటించిన తమిళ చిత్రం అరణ్మణై 4.

సుందర్ సీ( Sundar C ) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మరో కథానాయకిగా తమన్న నటించింది.ఈ చిత్రంలో అందాలను ఆరబోయడంతో రాశీఖన్నా తమన్నతో పోటీ పడిందనే చెప్పాలి.ఏదేమైనా అరణ్మణై 4 చిత్రం మంచి విజయాన్ని సాధించింది.ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్లో చేరిందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.అంతేకాదు ఇప్పుడీ చిత్రం బాలీవుడ్లోనూ విడుదలైంది.
ఈ సందర్భంగా నటి రాశీఖన్నా ఒక భేటీలో పేర్కొంటూ ఇప్పుడు తాను తమిళం, తెలుగు భాషలను అర్థం చేసుకుని మాట్లాడగలను.నేను ఇంతకు ముందు నటించిన రెండు తమిళ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి.
తాజాగా అరణ్మణై 4 తెలుగులో బాకు చిత్రంలో నటించడాన్ని గర్వంగా భావిస్తున్నానని పేర్కొంది.తాను హిందీ, తమిళం, తెలుగు భాషల్లో నటిస్తున్నానని, భాష అర్ధం అయితే ప్రేక్షకులకు దగ్గరవ్వవచ్చని తనకు తెలుసు అని పేర్కొంది.
కాగా తనకిప్పుడు తెలుగు, తమిళం భాషలను అర్థం చేసుకోగలుగుతున్నాను అని తెలిపింది.కాబట్టి ఇకపై తనకు భాషా సమస్య లేదని చెప్పింది.







