ఒకప్పటి రొమాంటిక్ హీరోపై ట్రోల్స్.. సైలెంట్ గా ఉంటే మంచిదంటూ?

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు మాధవన్.ఆయన నటించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.

 R Madhavan, Trolled, Isro, Mars Mission, Panchangam, Reaction, Rocketry, Nambi N-TeluguStop.com

ఇకపోతే తాజాగా మాధవన్  నటించిన దర్శకత్వం వహించిన ఈ సినిమా రాకెట్రీ.ఈ సినిమాను ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా రూపొందించారు.

బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్, హీరో సూర్య కీలక పాత్రలో నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ,హిందీ,ఇంగ్లీషు భాషల్లో జూలై 1న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.విడుదల తేదీకి మరికొద్ది రోజులు సమయం ఉండడంతో చిత్రబృందం ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేసింది.

ఈ క్రమంలోనే మాధవన్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతన్నాయి.ప్రెస్‌ మీట్‌లో అంతరిక్షంలోకి రాకెట్‌ను ప్రయోగించినప్పుడు, అది అంగారక కక్ష్యలోకి చేరేందుకు ఇస్రోకు పంచాగం ఉపయోగపడిందని మాధవన్‌ అన్నాడు.

ఇస్రోవాళ్లు పంచాంగం చూసి పెట్టిన ముహుర్త బలం వల్లే భారత మార్స్ మిషన్‌ అవాంతరాలను అధిగమించి కక్ష్యలోకి చేరింది.గ్రహాల స్థితిగతులన్నీ పంచాంగాల్లో నిక్షిప్తమై ఉంటాయి అని మాధవన్‌ వ్యాఖ్యలు చేయగా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ కావడంతో నెటిజన్స్‌ ట్రోలింగ్‌తో ఏకిపారేస్తున్నారు.

సైన్స్‌ అందరికీ అర్థమయ్యే విషయం కాదు.అలా అని సైన్స్‌ తెలియకపోవడం కూడా పెద్ద సమస్య కాదు.

కానీ అసలు విషయం తెలుసుకోకుండా ఇలా మాట్లాడే బదులు సైలెంట్‌గా ఉండటం మంచిది ‘మీరు మాట్లాడే దాంట్లో ఏమైనా అర్థం ఉందా.ఇవేం పిచ్చి మాటలు అంటూ వరుస కామెంట్లతో నెటిజన్లు దుమ్మెత్తిపోయగా ఈ ట్రోలింగ్‌ పై స్పందించిన మాధవన్‌ తమిళంలో పంచాంగం గురించి మాట్లాడినందుకు ట్రోలింగ్‌ సరైనదే.

నేను ఎంతటి అజ్ఞానిని.కానీ మార్స్ మిషన్‌లో మనం కేవలం 2 ఇంజిన్‌లతో సాధించామనే నిజాన్ని ఎవరు మార్చలేరు.దానికదే రికార్డు సృష్టించగలిగింది.వికాస్‌ ఇంజిన్‌ ఒక రాక్‌స్టార్‌ అని ట్వీట్‌ మాధవన్‌ ట్వీట్‌ చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube