దేవాలయాల శిథిలాలతో కతుబ్ మినార్ క‌ట్టారా?

భారతదేశంలోని అత్యంత ఎత్తైన టవర్ కుతుబ్ మినార్ అనే విష‌యం అంద‌రికీ తెలిసిందే.హిందూ దేవాలయాలకు.

 Qutub Minar Controversy Know Facts , Qutub Minar , Hindu Gods , Goddesses , 27-TeluguStop.com

కుతుబ్ మినార్‌కు సంబంధం ఉంద‌ని చ‌రిత్ర చెబుతోంది.ఆలయ అవశేషాలు కుతుబ్ మినార్ చుట్టుప‌క్క‌ల క‌నిపించాయి.

ఇటీవల విశ్వహిందూ పరిషత్‌ నాయకులు కుతుబ్‌మినార్‌ను సందర్శించారు.కుతుబ్ మినార్ చుట్టుప‌క్క‌ల‌ హిందూ దేవుళ్లు, దేవతల విగ్రహాల పరిస్థితి చూస్తుంటే హృదయవిదారకంగా ఉందని వీహెచ్‌పీ అధికార ప్రతినిధి అన్నారు.27 దేవాలయాలను కూల్చివేసిన తరువాత లభించిన శిధిలాల‌తో కుతుబ్ మినార్ నిర్మించారు.దీనికి ప్ర‌తిగా గతంలో కూల్చివేసిన మొత్తం 27 దేవాలయాలను పునర్నిర్మించాలని, హిందువులకు పూజలు చేయడానికి అనుమతించాలని ఆ సంస్థ డిమాండ్ చేసింది.

ఈ డిమాండ్‌ను ఇప్పటికే వివిధ సంస్థలు లేవనెత్తాయి.

దీంతో పాటు కుతుబ్‌మినార్‌లో ఉంచిన వినాయక విగ్రహాలపై కూడా వివాదం కొనసాగుతోంది.

కుతుబ్‌మినార్‌లో ఉంచిన వినాయక విగ్రహాలను గౌరవప్రదమైన ప్రదేశంలో లేదా మ్యూజియంలో ఉంచాలనే డిమాండ్ గతంలోనే ఉంది.అంతే కాకుండా కుతుబ్‌మీనార్‌లో సరైన స్థలంలో విగ్రహాలను ఉంచి పూజలు-ఆరతి చేయాలన్నది కొందరి డిమాండ్.

హిందూ.జైన దేవాలయాల స్తంభాలు, రాళ్ళు మొద‌లైన‌వి కుతుబ్ మినార్, దాని ప్రక్కనే ఉన్న అద్భుతమైన కువ్వత్-ఉల్-ఇస్లాం మసీదు నిర్మాణంలో ఉపయోగించార‌ని తెలుస్తోంది.

చరిత్రకారుడు ప్రొఫెసర్ ఇర్ఫాన్ హబీబ్ మాట్లాడుతూ అవి ఆలయంలో భాగమేననడంలో సందేహం లేదు.కానీ అక్కడ ఉన్న దేవాలయాలు, అక్కడ ఉన్నాయా లేదా ఎక్కడో దగ్గరలో ఉన్నాయా అనేది చర్చనీయాంశంగా నిలిచింది.‘కుతుబ్ మినార్ అండ్ ఇట్స్ మాన్యుమెంట్స్’ అనే పుస్తక రచయిత,చరిత్రకారుడు BM పాండే అసలు దేవాలయాలు ఇక్కడే ఉన్నాయని నమ్ముతున్నట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube