విశాఖపట్నంలో వైశాఖి జల ఉద్యానవనం లో క్వీన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రావణ లక్ష్మి – 2022 కార్యక్రమం విజయవంతంగా సాగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ శ్రీమతి గోలగాని హరి వెంకట కుమారి గారు మరియు వైసీపీ మహిళా నాయకురాలు పేడాడ రమణికుమారి గారు హాజరయ్యారు .
ఈ సందర్భంగా శ్రావణ లక్ష్మి 2002 కార్యక్రమంలో పాల్గొన్న యువత యువతులు తెలుగునాట తెలుగుతనం ఉట్టిపడేలా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమంలో అద్భుతంగా ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో విజేతలకు అతిథులు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
విశాఖ నగరం కళలకు పుట్టినిల్లు అని మహిళలు పురుషులతో సమానంగా రాణించాలని .ఈ కార్యక్రమం చూస్తుంటే శ్రావణమాసం ముందే వచ్చినట్టు అనిపిస్తుంది అని ఆనందం వ్యక్తం చేశారు.కళాశాల విద్యార్థులు భారతీయ సంప్రదాయాలు పాటించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఈవెంట్ ఆర్గనైజర్ ఉషా రాణి గారు,అక్షర కిరణం ఎడిటర్ పూజారి సత్యనారాయణ గారు,పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.