రాఖీ పండగ( Raksha Bandhan ) గురించి భారతీయులకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.అన్నాచెల్లెళ్ల అనుబంధానికి, ప్రేమకు ప్రతీక రాఖీ పండుగ.
ఇక ఈ పండుగ దగ్గర పడిందంటే అన్నా చెల్లెళ్ళ కోలాహలం అంతాఇంతా కాదు.ఎక్కడెక్కడ వున్నవారైనా ఈరోజు తమ తోబుట్టువుల దగ్గర వాలిపోతూ వుంటారు.
ఇక రాఖి పండగ దగ్గర పడడంతో రకరకాల రాఖీలు మార్కెట్లో సందడి చేస్తున్నాయి.ఈ క్రమంలో డోరేమాన్, ( Doraemon rakhi )భీమ్ వంటి రాఖీలు పిల్లల్ని ఎంతగానో అట్రాక్ట్ చేస్తుంటే.
ఈసారి మార్కెట్లోకి సరి కొత్త రాఖీలు వచ్చి పడ్డాయి.అవే QR కోడ్ రాఖీలు( QR code rakhi ).

అవును, వినడానికి విడ్డురంగా వున్నా, మీరు విన్నది నిజం.వీటి ప్రత్యేకత తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ పూర్తి కధనం చదవాల్సిందే.ఇకపోతే రాఖీల తయారీకి రాజస్థాన్ ప్రసిద్ధిగాంచింది.దేశంలో అమ్మే రాఖీలలో 50 శాతం రాఖీలు ఇక్కడే తయారు చేస్తారు అంటే మీరు నమ్మితీరాల్సిందే.ఇక అల్వార్‌లో అయితే అనేక రకాల డిజైన్లలో వినూత్నమైన రాఖీలు తయారవుతాయి.కాగా ఎప్పటిలాగే ఈసారి కూడా అక్కడ ఆకర్షణీయమైన డిజైన్లతో రాఖీలు రూపొందించారు.
అయితే కొత్తగా ఈ ఏడాది QR కోడ్ డిజైన్‌తో కొత్త రాఖీలు తయారు చేసారు.దాంతో ఈ రాఖీలు జనాలను ఎంతగానో అట్రాక్ట్ చేస్తున్నాయి.

అక్కడ వున్న కోడ్స్ పై మొబైల్ ఫోన్ ఉపయోగించి స్కాన్ చేస్తే యూట్యూబ్‌లో కార్టూన్ పాత్రలతో కూడిన యానిమేషన్ చిత్రాలు కనిపిస్తాయి.అంతేకాదండోయ్… పాటలు కూడా వినిపిస్తాయి.భీమ్, డోరేమాన్, గణేష్, కృష్ణుడు వంటి డిజైన్లలో ఈ రాఖీలు లభ్యమవుతున్నాయి.అంతేకాకుండా పిల్లలు ఇష్టపడే 3D రాఖీలు కూడా అందుబాటులో ఉన్నాయి మిత్రులారా.ఈ డిజైన్లలో మోటూ పత్లూ, భీమ్, బాల గణేశ్ వంటి పాత్రలు, డిజైన్లు మెండుగా ఉన్నాయి.అదేవిధంగా ఓంకారపు రాఖీలు, స్వస్తిక్ రాఖీలు( Swastik Rakhis )పిల్లల కోసం టెడ్డీ బేర్, లైటింగ్ రాఖీలు అనేకం మార్కెట్లో కనిపిస్తున్నాయి.
అల్వార్‌లో ఏడాది పొడవునా చాలామంది రాఖీలు తయారు చేస్తుంటారనే విషయం మీకు తెలిసినదే.అక్కడ సుమారు 5 వేల కుటుంబాలు వీటిని తయారు చేయడమే జీవనోపాధిగా ఎంచుకున్నారు అంటే మీరు నమ్మితీరాల్సిందే.
అందరికీ ఎంతో ఇష్టమైన ఈ పండగను ఈసారి ఆగస్టు 30 వ తేదీన జరుపుకోబోతున్నారు.