తెలంగాణ రాష్ట్రం లో మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది.క్యూ న్యూస్ తో తెలంగాణ యువత లో మంచి పట్టు సాధించిన తీన్మార్ మల్లన్న( Teenmaar Mallanna ) కొత్త పార్టీని ప్రకటించాడు.
పలు కేసుల్లో ఇటీవలే జైలుకు వెళ్లిన మల్లన్న తాజాగా బెయిల్ పై బయటకు వచ్చాడు.బయటకు వచ్చిన వెంటనే రాజకీయ పార్టీ ని ప్రకటించడం తో తెలంగాణ రాష్ట్ర రాజకీయ చదరంగం లో కొత్త ఎత్తుగడ మొదలు పెట్టినట్లు అయింది.
రాజకీయం చేసేందుకు గతంలోనే బిజెపి లో( BJP ) చేరిన తీన్మార్ మల్లన్న అక్కడ కొనసాగలేక వెంటనే బయటికి వచ్చేశాడు.ఇప్పుడు సొంతంగా కొత్త పార్టీ పెట్టడం తో కచ్చితంగా యువత లో మంచి ఆదరణ ఉన్న కారణంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది.
ఆ మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా తీన్మార్ మల్లన్న కి యువత నుండి మద్దతు లభించే అవకాశం ఉంది.అదే నిజమైతే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.ఇక తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల( YS Sharmila ) పార్టీ ఏర్పాటు చేసి ప్రజల్లో ఉంటున్నారు.
ఆమె పాదయాత్ర చేయడం ద్వారా పాపులారిటీని సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆమె కంటే కూడా ఎక్కువ ప్రభావాన్ని తీన్మార్ మల్లన్న చూపించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.షర్మిల కంటే ఎక్కువగా తీన్మార్ మల్లన్న ఎఫెక్ట్ వచ్చే ఎన్నికల్లో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని కూడా రాజకీయ విశ్లేషకులు మరియు రాజకీయ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.తీన్మార్ మల్లన్న ఎక్కువగా కేసులు ఎదుర్కొంటూ ఉండటం వల్ల యువతలో మంచి ఆదరణ దక్కించుకున్నాడు.
అలాగే పబ్లిసిటీ కూడా సొంతం చేసుకున్నాడు.అందుకే ఆయన రాజకీయ పార్టీ ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.