Python Crocodile : భారీ మొసలిని మింగేసిన కొండచిలువ.. పొట్ట కోయగానే షాక్

పాముల మాదిరిగా కొండ చిలువలు విషపూరితమైనవి కావు.అయితే వాటికి ఏదైనా జంతువులు చిక్కితే మాత్రం అమాంతంగా మింగేస్తాయి.

 Python That Swallowed A Huge Crocodile Shock When The Stomach Was Cut , Python,-TeluguStop.com

జింకలు, దుప్పులు వంటి వాటితో పాటు మనుషులను కూడా అమాంతంగా జీర్ణం చేసుకోగల సామర్ధ్యం వాటికి ఉంది.అయితే బర్మీస్ పైథాన్‌లను ఏవైనా మింగితే చిన్న వాటిని మాత్రమేనని అంతా అనుకుంటారు.సాధారణంగా జింకలను కూడా బర్మీస్ పైథాన్‌ను మింగవు.ఇక తింటే అంతకంటే చిన్న జీవులను మింగేస్తాయి.ఆ తర్వాత వాటిని జీర్ణం చేసుకోవడానికి చెట్టును చుట్టుకుని లోపలివి ముద్దగా అయిపోయేలా చేసుకుంటాయి.ఇటీవల ఇదే తరహాలో ఓ కొండ చిలువ దొరికింది.

దానిని కోసి చూసిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

అమెరికాలోని ఫ్లోరిడాలో శాస్త్రవేత్తలకు ఓ భారీ కొండ చిలువ కనిపించింది.దానిని చూసిన వారు అది ఏం మింగి చనిపోయిందో అర్ధం కాక దానిని ల్యాబ్‌కు తీసుకెళ్లారు.అక్కడ దానిని కోసి చూడగానే వారు షాక్ అయ్యారు.సాధారణంగా కొండ చిలువలు తమ సమీపంలో ఉన్న చిన్న చిన్న జంతువులను మింగుతాయి.అయితే వారికి దొరికిన కొండ చిలువ మాత్రం ఏకంగా మొసలిని మింగింది.ఆ మొసలి చిన్నది కాదు.

ఏకంగా ఐదు అడుగులు ఉంది.దీంతో అంత పెద్ద మొసలిని ఎలా మింగిందోనని ఆశ్చర్యపోయారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్లోరిడా సైంటిస్టులు దానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.ఇది చూసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.

అంత పెద్ద మొసలిని ఆ కొండ చిలువ ఎలా మింగేసిందని తలలు పట్టుకుంటున్నారు.దాని కంటికి మనిషి చిక్కితే పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube