నా రిలేషన్ షిప్ స్టేటస్ ఇదే.. లవ్ లైఫ్ గురించి పీవీ సింధు ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!

బ్యాడ్మింటన్‌ క్రీడాకారిని పీవీ సింధు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమెకు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలామంది అభిమానులు ఉన్నారు.

 Pv-sindhu-encountered-questions-on-her-personal-life-in-interview, Pv Sindhu, Pe-TeluguStop.com

భారత అగ్రశ్రేణి బ్యాట్మింటన్ క్రీడాకారిణిగా ఈమె బాగా గుర్తింపు తెచ్చుకుంది.ఎన్నోసార్లు గెలిచి తన పేరు మారుమోగే విధంగా గుర్తింపు తెచ్చుకుంది సింధు.

ఇది ఇలా ఉండే ఇటీవలే ఒక యూట్యూబ్ ఛానల్ పాడ్ కాస్ట్ లో పాల్గొంది సింధు.ఈ నేపథ్యంలోనే ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాల గురించి లవ్ లైఫ్ రిలేషన్షిప్ ఇలా ఎన్నో విషయాల గురించి స్పందించింది పీవీ సింధు.

రిలేషన్‌ షిప్‌ స్టేటస్‌పై స్పందిస్తూ.నేను సింగిల్‌.ప్రస్తుతం నాకు బ్యాడ్మింటన్‌ తప్ప మరే ఆలోచన లేదు.నా లక్ష్యం ఒలింపిక్స్‌.

దాని కోసమే కష్టపడుతున్నాను అని చెప్పుకొచ్చింది సింధు.బ్యాడ్మింటన్‌ కాకుండా మరో భాగస్వామి ఉండాలని మీరు అనుకుంటున్నారా? అని అడగగా దాని గురించి నేనెప్పుడూ అంతగా ఆలోచించలేదు.అదంతా విధి అని భావిస్తాను.ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది అని సింధు సమాధానమిచ్చింది.ఎవరితోనైనా డేటింగ్‌ చేశారా? అని ప్రశ్నించగా.లేదు అని తెలిపింది.

ఇకపోతే ఆమె కెరియర్ విషయానికి వస్తే ఇప్పటికే ఒలంపిక్స్ లో రెండు పథకాలు సాధించిన సింధు వచ్చే ఏడాది జరగబోయే పారిస్ ఒలంపిక్స్ కు సిద్ధమవుతోంది.

Telugu Personal, Pv Sindhu, Ship-Latest News - Telugu

మూడో ఒలింపిక్‌ పతకానికి గురిపెట్టిన ఈ తెలుగు తేజం ప్రస్తుతం బ్యాడ్మింటన్‌ లెజెండ్‌ ప్రకాశ్ పదుకొణె ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటోంది.ఇటీవల ఈ విషయాన్ని సింధు ఎక్స్‌లో పోస్ట్‌ చేస్తూ. ప్రకాశ్ పదుకొణెను తన మెంటార్‌ గా పేర్కొన్న విషయం తెలిసిందే.

ఒలంపిక్స్ లో ఏకంగా రెండుసార్లు గెలిచి ఎంతోమందికి స్ఫూర్తిదాయంగా నిలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube