ఇంట్లో ఈ ఫోటోలు ఉంటే అదృష్టం మీ వెంటే..?

భారతదేశంలో సంస్కృతి సంప్రదాయాలను పాటించడంతో పాటు వాస్తు శాస్త్రాన్ని కూడా ఎక్కువగా విశ్వసిస్తుంటారు.

మనం చేసే ప్రతి చిన్న పని కూడా వాస్తు ప్రకారం బాగుండాలని ఆలోచిస్తారు.

వాస్తు శాస్త్రానికి అనుగుణంగానే మన ఇంట్లో అలంకరించుకొనే వస్తువుల నుంచి ఉపయోగించే వస్తువుల వరకు వాటిని కొనుగోలు చేసి మన ఇంట్లో అమర్చుకుంటాము.ఈ నేపథ్యంలోనే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని ఫోటోలు మన ఇంట్లో ఉంటే అదృష్టం కలిసొస్తుందని ఎంతో మంది భావిస్తుంటారు.

అదృష్టం కలిసి రావడానికి మన ఇంట్లో ఎలాంటి ఫోటోలను పెట్టుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.వాస్తు శాస్త్రం ప్రకారం చేప బొమ్మలు ఉన్న ఫోటోలను మన ఇంటి గోడకు పెట్టడం శుభసూచకం.

ఈ చేపల ఫోటోను మన ఇంట్లో ఉంచడం వల్ల మన కుటుంబ సభ్యులు దీర్ఘాయుష్షును కలిగి ఉంటారు.అదేవిధంగా జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కోవడమే కాకుండా మంచి విజయాలను కూడా అందుకుంటారు.

Advertisement

అదేవిధంగా సూర్యోదయం అవుతూ ఉన్నటువంటి ఫోటోలు, పర్వతాలు కలిగినటువంటి ఫోటోలు ఉండటాన్ని శుభపరిణామమని చెబుతారు.వాస్తు శాస్త్రం ప్రకారం ఇలాంటి ఫోటోలు మన ఇంట్లో ఉండటం వల్ల మన ఇంట్లో సానుకూల శక్తి ఏర్పడటమే కాకుండా జీవితంలో కొత్త ఆశలను కలిగిస్తుంది.

మన ఇంట్లో మన కుటుంబ సభ్యుల ఫోటోలను గోడకు పెట్టినప్పుడు ఆ ఫోటోలలో ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా ఉన్నటువంటి ఫోటోలను మాత్రమే పెట్టుకోవాలి.అలాంటి చిత్రం మన ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి.మన ఇంట్లో నీటి ప్రవాహాన్ని కలిగి ఉండే ఫోటోలను పెట్టుకోవడం అదృష్టంగా భావిస్తారు.

కానీ సముద్రం, చెరువులు, నీటి బుగ్గలు ఏర్పడే ఫోటోలను పెట్టుకోవడం వల్ల మన కుటుంబంలో చెడు సంఘటనలు జరుగుతాయని భావిస్తారు.అందుకోసమే ఎల్లప్పుడు నీరు ప్రశాంతంగా ప్రవహించేటటువంటి చిత్రాలను పెట్టుకోవడం ద్వారా మన ఇంట్లో అదృష్టం పెరుగుతుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో ఎప్పుడూ కూడా అడవి, క్రూర జంతువులు, చారిత్రాత్మక పోరాటాలను తెలియజేసే ఫోటోలను ఉంచకూడదు.ఇలాంటి ఫోటోలు మన ఇంట్లో ఉండటం వల్ల నిత్యం ఆ కుటుంబ సభ్యులలో తెలియని ఆందోళనలు కలగడమే కాకుండా, మనం చేసేటటువంటి పనులలో కూడా ఆటంకాలు ఏర్పడతాయి.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?
Advertisement

తాజా వార్తలు