'పుష్ప' షూట్ కోసం డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్ !

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత సంవత్సరం వచ్చిన అల వైకుంఠపురములో సినిమా తో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.

ఈ సినిమా ఇచ్చిన జోష్ తో లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా స్టార్ట్ చేసాడు.

షూటింగ్ అంతరాయం లేకుండా జరుగుతున్నది అనుకుంటున్న సమయంలో కరోనా కారణంగా వాయిదా పడింది.అయితే లాక్ డౌన్ తర్వాత మళ్ళీ షూట్ స్టార్ట్ చేసారు.

కానీ మళ్ళీ కొన్ని రోజులకే కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అవ్వడంతో షూటింగ్ అర్ధాంతరంగా నిలిపి వేశారు.దీంతో ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాలేక పోతుంది.

అయితే ఇప్పుడిప్పుడే సెకండ్ వేవ్ నుండి కూడా బయట పడుతుండడంతో షూటింగ్స్ ఒక్కొక్కటిగా రీస్టార్ట్ అవుతున్నాయి.ఇప్పుడు అదే కోవలోకి పుష్ప సినిమా కూడా చేరి పోయింది.

Advertisement
Allu Arjun Pushpa Movie Team Ready To Shoot From July 5, Allu Arjun, Sukumar, Pu

ఈ సినిమా షూట్ ను కూడా రీస్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

Allu Arjun Pushpa Movie Team Ready To Shoot From July 5, Allu Arjun, Sukumar, Pu

అందుకోసం డేట్ కూడా ఫిక్స్ చేసారు.జులై 5న ఈ సినిమా షూట్ ను మళ్ళీ రీస్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.ఈ షెడ్యూల్ నాన్ స్టాప్ గా ఉండబోతుందట.

అయితే ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు.మొదటి భాగం షూట్ 90 శాతం మేరకు పూర్తి అయ్యింది.

మిగిలిన భాగాన్ని కూడా పూర్తి చేసి దసరా బరిలోకి దింపాలని సుకుమార్ స్కెచ్ వేసాడు.

Allu Arjun Pushpa Movie Team Ready To Shoot From July 5, Allu Arjun, Sukumar, Pu
తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

ఇక ఇందులో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు.ఈయనకు జోడీగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

Advertisement

ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా పుష్ప ఆల్బమ్ పై మంచి హైప్ ఏర్పడింది.అంతేకాదు త్వరలోనే ఫస్ట్ సింగల్ కూడా రాబోతుందని తెలుస్తుంది.

తాజా వార్తలు