ప్రస్తుతం టాలీవుడ్ లో దాదాపు అందరు హీరోలతో సినిమాలు తీసిన.తీయబోతున్న రికార్డుకు చేరువలో మైత్రి మూవీ మేకర్స్ ఉన్నారు.
మెగాస్టార్ చిరంజీవి మొదలుకుని వారి ఇంటి కొత్త వారసుడు వైష్ణవ్ తేజ్ వరకు సినిమాలను తీయడం జరిగింది.బాలయ్య తో ప్రస్తుతం సినిమాను చేస్తున్నారు.
మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యతలను కూడా తీసుకుంటున్నారు.ఇంకా ఎంతో మంది యంగ్ స్టార్ హీరోలు.
చిన్న హీరోలు.సూపర్ స్టార్స్ స్టైలిష్ స్టార్స్ తో సినిమా లు చేసిన చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వారు చేసిన తప్పును ఏ ఒక్కరు ప్రశ్నించడం లేదు అంటూ అల్లు అర్జున్ అభిమానులతో పాటు సగటు సినీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
రెండు మూడు సంవత్సరాల క్రితం ఒక సినిమా థియేటర్లలో విడుదల అయిన తర్వాత కనీసం 50 రోజులు దాటిన తర్వాతే ఓటీటీ లో స్ట్రీమింగ్ అవ్వాలి.ఇక శాటిలైట్ విషయానికి వస్తే వంద రోజుల వరకు వెయిట్ చేయాల్సిందే.
కాని ఇప్పుడు పరిస్థితి మారింది.కరోనా వల్ల థియేటర్లలో జనాలు ఎక్కువగా ఉండటం లేదు.

అందుకే ఓటీటీ స్ట్రీమింగ్ కు కేవలం నాలుగు లేదా అయిదు వారాల సమయం ఇస్తున్నారు.నాలుగు వారాలు మినిమంగా కొనసాగుతున్నాయి.అట్టర్ ప్లాప్ సినిమా లు అయితే మూడు వారాల్లోనే వస్తున్నాయి.కాని పుష్ప సినిమా ను మూడవ వారంలో నే అమెజాన్ స్ట్రీమింగ్ చేసేందుకు సిద్దం అయ్యింది.
ఈనెల 7 నుండి అమెజాన్ లో పుష్ప సినిమా స్ట్రీమింగ్ అవ్వబోతుంది.ఆ విషయాలు అధికారికంగా వెళ్లడి అయ్యాయి.మూడు వారాల్లో 300 కోట్లు వసూళ్లు చేసిన పుష్ప సినిమా ఉత్తరాదిన భారీగానే వసూళ్లు రాబడుతుంది.ఇక సంక్రాంతి వరకు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు దక్కించుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.
అయినా కూడా పుష్ప ను మూడు వారాల్లోనే ఓటీటీ లో స్ట్రీమింగ్ చేసేందుకు ఇవ్వడం ఎంత వరకు సబబు అంటూ థియేటర్ల యాజమాన్యలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంలో సినిమా మేకర్స్ తో ఎవరు కూడా మాట్లాడేందుకు ముందుకు రావడం లేదు ఎందుకు అంటూ నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి.