క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun)హీరోగా నటించిన చిత్రం పుష్ప(Pushpa).ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి ఆదరణ పొందిందో మనకు తెలిసిందే.
ముఖ్యంగా ఈ సినిమాలోని ప్రతి ఒక్క పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు మనకు ఎక్కడ చూసిన వినపడుతూ ఉన్నాయి.
అంటే ఈ పాటలకు ఎలాంటి ఆదరణ వచ్చిందో అర్థం అవుతుంది.ఈ సినిమాలోని సామీ సామి (Saami Saami Song) అనే పాట ఎంత సెన్సేషనల్ అయిందో అందరికీ తెలిసిందే.
ఇక ఈ పాటను తమిళ సింగర్ రాజ్యలక్ష్మి (Rajyakakshmi).ఎంతో అద్భుతంగా పాడారు.

ఈ పాట ద్వారా ఈమె పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ఫేమస్ అయ్యారని కూడా చెప్పాలి.టీవీ ఛానల్ లో ప్రసారమవుతున్న సూపర్ సింగర్స్ కాంపిటీషన్లో సింగర్ గా పాల్గొని అనంతరం కప్పు గెలుచుకున్నటువంటి సెంథిల్, రాజ్యలక్ష్మి దంపతుల గురించి చెప్పాల్సిన పని లేదు.ఇలా బుల్లితెరపై సింగర్లుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వీరిద్దరూ అనంతరం సినిమా ఇండస్ట్రీలో అవకాశాలను అందుకొని సింగర్లుగా మంచు గుర్తింపు పొందారు.

ఇలా సింగర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి రాజ్యలక్ష్మి కి అద్భుతమైన ఆఫర్ వచ్చింది అయితే 32 సంవత్సరాల వయసులో ఇద్దరు పిల్లల తల్లి అయినటువంటి ఈమె ఏకంగా హీరోయిన్గా అవకాశమందుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.రాజ్యలక్ష్మి హీరోయిన్గా నటించిన చిత్రం సైలెన్స్ (Silence) ఈ సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకుని త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఇందులో భాగంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ఈ వయసులో తనకు హీరోయిన్గా అవకాశం రావడం తాను అస్సలు ఊహించలేదని తెలిపారు.
ఈ సినిమా డైరెక్టర్ ఫోన్ చేసి తనకు కథ చెప్పగా ఇందులో నా పాత్ర ఏంటి అని అడగడంతో మీరే ప్రధాన పాత్రలో నటిస్తున్నారని చెప్పడంతో ఆశ్చర్యపోయానని ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి చిత్ర బృందానికి ఈమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.