చిరుతో మరో రంగస్థలం తీయబోతున్న సుకుమార్..!

లెక్కల మాస్టారు సుకుమార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు రంగస్థలం అనే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.అప్పటి వరకు రొటీన్ సినిమాలను చేసుకుంటూ పోతున్న రామ్ చరణ్ కు రంగస్థలం సినిమాతో తన లోని నటనను బయటకు తీసి మెగాస్టార్ వారసుడు అంటే ఇలా ఉంటాడు అని నిరూపించాడు.

 'pushpa' Director Joins Hands With Megastar Chiranjeevi, Chiranjeevi, Sukumar,-TeluguStop.com

ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ పుష్ప సినిమా చేసాడు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప‘ ఎంత ఘనవిజయం సాధించిందో అందరికి తెలుసు.

ఈ సినిమాతో సుకుమార్ మరొక సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ సినిమాతో తనని తాను మరోసారి నిరూపించు కున్నాడు.

ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో ఈయన దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించింది.

ఇక ఇప్పుడు పుష్ప పార్ట్ 2 మీద తన ధ్యాస మొత్తం పెట్టేసాడు.

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగు తున్నాయి.త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఈ డిసెంబర్ లోనే మళ్ళీ పార్ట్ 2 తో రావాలని అనుకుంటున్నారు.అయితే ఇప్పుడు సుకుమార్ పుష్ప పార్ట్ 2 పూర్తి అయినా తర్వాత నెక్స్ట్ చిరంజీవి తో సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.

సుకుమార్ తో కలిసి చిరు ఒక భారీ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నారని టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తుంది.చిరంజీవి ఇప్పటికే నాలుగైదు సినిమాలతో బిజీగా ఉన్నాడు.అయినా కూడా కొత్త కథలను వింటూనే ఉన్నాడు.ఇక ఇప్పుడు సుకుమార్ కు కూడా ఓకే చెప్పాడని సుకుమార్ ఇప్పుడు కథను నేరేట్ చేసే పనిలో ఉన్నాడని టాక్ నడుస్తుంది.

అలాగే మరొక వారం లోగానే ఈ సినిమాపై అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఫిలిం ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతుంది.ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తిగా తెలియదు కానీ ఈ సినిమా కూడా రంగస్థలం తరహా లోనే మాస్ కంటెంట్ తో పాటు కాన్సెప్ట్ ఉన్న సినిమాని తెరకెక్కిస్తున్నాడని వినికిడి.మరి చూడాలి ఈ సినిమా నిజంగా ఉంటుందో లేదంటే ఇవన్నీ రూమర్స్ గానే మిగిలి పోతాయో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube