టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ ( Sukumar )దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం పుష్ప 2( Pushpa 2 ).2021 లో విడుదల అయిన పుష్ప 1 కి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.అనసూయ సునీల్ వంటి వారు కీలక పాత్రలో నటిస్తున్నారు.పుష్ప 2 కోసం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.అందుకు అనుగుణంగా మూవీ మేకర్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ఒకేసారి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే వ్యూహంతో నిర్మాణం చేపడుతున్నారు.

ఫస్ట్ పార్ట్ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.భాషతో సంబంధం లేకుండా పుష్ప మేనరిజమ్ తో డైలాగ్‌తో ప్రపంచం మొత్తం ఊగిపోయింది.ఆ రెస్పాన్స్ ని దృష్టిలో ఉంచుకొని కొనసాగింపుగా వస్తున్న పుష్ప: ది రూల్( Pushpa: The Rule ) ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో తెరకెక్కించడంతో పాటు, ఒకేసారి పలు భాషల్లో ఒకేసారి విడుదల చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు నిర్మాతలు.పుష్ప: ది రూల్ సినిమాని మాత్రం భారత్‌లో విడుదల చేసిన రోజునే, ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ప్రకటించింది.ఆ సంగతి పక్కన పెడితే.పుష్ప ద రైజ్ కి సీక్వెల్ గా పుష్ప ద రూల్ తెరకెక్కుతుండగా ఇప్పుడు దానికి సీక్వెల్ గా పుష్ప 3 ( Pushpa 3 )ఉంటుంది అంటూ మేకర్స్ నుంచి వస్తున్న స్పాయిలర్స్ తో అల్లు ఫాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు.

గత కొద్ది రోజులుగా పుష్ప,3 పై అనేక రకాల వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.అయితే మరి పుష్ప పార్ట్ 3 లో ఏం చూపిస్తారు.అసలు దీని నేపథ్యం ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు అల్లు ఫాన్స్ లో నడుస్తున్న ఆసక్తికర అంశంగా మారింది.అయితే పుష్ప 3 కథని జపాన్ బ్యాక్ డ్రాప్ లో( Japan ) సుకుమార్ రెడీ చేసుకుంటున్నట్లు వార్తలు పుట్టుకొచ్చాయి.
రీసెంట్ గా బన్నీ జర్మనీలో జరుగుతున్న బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు చీఫ్ గెస్ట్ గా హాజరై తాజాగా సోమవారం రోజున హైదరాబాద్ కి చేరుకున్నాడు.దానితో పార్ట్ 3 లో జర్మనీ నేపథ్యం ఉండబోతుంది అంటున్నారు.
ఆర్ఆర్ఆర్, బాహుబలి మూవీలకు జపాన్ మార్కెట్ లో సూపర్ క్రేజ్ లభించింది.అందుకే పుష్ప3ను జపాన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడని టాక్.
మరి పుష్ప పార్ట్ 2 ని త్వరగా చిత్రీకరించి పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్లాలని సుకుమార్, అల్లు అర్జున్ చూస్తున్నారట.అయితే ఆగస్ట్ 15 న పుష్ప 2 విడుదల కానుంది.