టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అల్లు అర్జున్,రష్మిక మందన జంట గా నటించిన చిత్రం పుష్ప.2021 లో విడుదల అయిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ సినిమా భారీగా కలెక్షన్స్ రాబట్టింది.
బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.దీంతో డైరెక్టర్ సుకుమార్( Sukumar ) పార్ట్ 2 ని అంతకుమించి అనే విధంగా రూపొందిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే.
పుష్ప 2( Pushpa 2 ) సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.కాగా సెకండ్ పార్ట్ పుష్ప ది రూల్ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.పుష్ప 2 అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
పుష్ప 2 కీ సంబంధించిన అప్డేట్లు విడుదల చేయమంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా గురించి ఒక అప్డేట్ బయటకు వచ్చింది.
ప్రస్తుతం పుష్ప 2 అప్డేట్ గురించి ఫిల్మ్ సర్కిల్లో ఓ ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది.అదేమిటంటే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప2 సినిమాకు సంబంధించిన అప్డేట్ ని విడుదల చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఇప్పటివరకు జరిగిన చిత్రీకరణలో నుంచి ఓ మూడు నిమిషాల యాక్షన్ టీజర్ ను సిద్ధం చేస్తున్నారట.ఇప్పటికే టీజర్ కట్ పూర్తయ్యిందని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జరుగుతోందని తెలుస్తోంది.మరోవైపు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించే పనిలో ఉన్నారని తెలుస్తోంది.బన్నీ బర్త్ డే కానుకగా రిలీజ్ కాబోయే ఈ టీజర్ యాక్షన్ షాట్స్ ఎక్కువగానే ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అలాగే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయనున్నారట.ఇందులో నిజా నిజాలు తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి.