క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ( Sukumar )దర్శకత్వంలో అల్లు అర్జున్( Allu Arjun ) రష్మిక మందన్న ( Rashmika Mandanna ) హీరో హీరోయిన్లుగా నటించినటువంటి పాన్ ఇండియా చిత్రం పుష్ప(Pushpa).ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి ఆదరణ పొందిందో మనకు తెలిసిందే.
ఇలా ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు మించి సీక్వెల్ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో దర్శక నిర్మాతలు బిజీ అయ్యారు.ఇక ఈ సినిమా సీక్వెల్ చిత్రం కోసం అభిమానులు కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 50 శాతం పూర్తి అయిందని తెలుస్తుంది.తాజాగా ఈ సినిమా సీక్వెల్ కు సంబంధించి కీలక అప్డేట్ విడుదల చేశారు నటుడు ఫహద్ ఫాసిల్( Fahadh Fassil ).ఈయన ఈ సినిమాలో బన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్న విషయం మనకు తెలిసిందే.పుష్ప సినిమాలో ఈయన క్లైమాక్స్ సీన్ లో ఎంతో అద్భుతంగా నటించారు.
అయితే సీక్వెల్ చిత్రంలో మాత్రం ఎక్కువగా ఈయన పాత్ర ఉండబోతుందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ విషయం గురించి ఫహద్ ఫాసిల్ కీలక అప్డేట్ ఇచ్చారు.
దీంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఫహిద్ ఫాసిల్ ఈ సినిమా గురించి అప్డేట్ ఇస్తూ పుష్ప సినిమాలో కన్నా పుష్ప 2( Pushpa 2 ) సినిమాలో తన పాత్ర ఓ రేంజ్ లో ఉండబోతుందని ఇందులో తనకు అల్లు అర్జున్ కు మధ్య ఎక్కువగా యాక్షన్ సన్ని వేషాలు ఉన్నాయి అంటూ ఈ సందర్భంగా ఈ సినిమా గురించి ఈయన అప్డేట్ ఇచ్చారు.అయితే ఇప్పటికే ఈ సినిమాలో పహద్ ఫాజిల్ పాత్రకు సంబంధించి షూటింగ్ మొత్తం పూర్తయిన విషయం మనకు తెలిసిందే.ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతిబాబు (Jagapathi Babu) కూడా కీలకపాత్రలో నటించబోతున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.