Akash Puri: ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న పూరి జగన్నాథ్ తనయుడు..!!

పూరి జగన్నాధ్ ( Puri jagannadh ) తనయుడి గా సినీ ఇండస్ట్రీలోకి ఆంధ్రాపోరి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు ఆకాష్ పూరి..

 Puri Jagannaths Son Who Is Going To Marry The Girl He Loves-TeluguStop.com

ఈయన హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే బుజ్జిగాడు,చిరుత, బిజినెస్ మ్యాన్, గబ్బర్ సింగ్ వంటి కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు.ఇక ఆంధ్రాపోరి ( Andrapori ) మూవీ తో మొదటిసారి తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యారు.

ఇక ఈ సినిమా అంతగా హిట్ టాక్ తెచ్చుకోకపోయినప్పటికీ పూరి జగన్నాథ్ కొడుకుగా ఆకాష్ కి మంచి గుర్తింపు అయితే వచ్చింది.ఈయన మెహబూబా, రొమాంటిక్, చోర్ బజార్ వంటి కొన్ని సినిమాల్లో కూడా హీరోగా చేశారు.

అయితే తాజాగా ఆకాష్ పూరి గురించి ఒక గుడ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అదేంటంటే ఆకాష్ పూరి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారట.

Telugu Akash Puri, Akashpuri, Akash Romantic, Andrapori, Bujjigadu, Mehabuba, Pu

26 సంవత్సరాలున్న ఆకాష్ పూరి ( Akash Puri ) తాను ప్రేమించిన అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి.అయితే ఇది అఫీషియల్ న్యూస్ అని, పక్క నిజం అంటూ కొంతమంది అభిమానులైతే థంబ్ నెయిల్స్ వేసి మరీ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.ఇక ఆకాష్ ఒక రాజకీయ నాయకుడి మనవరాలితో గత కొద్ది రోజులుగా ప్రేమలో ఉన్నారట.

Telugu Akash Puri, Akashpuri, Akash Romantic, Andrapori, Bujjigadu, Mehabuba, Pu

ఆ అమ్మాయి ఆకాష్ పూరి ఇద్దరు ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండడంతో తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో వాళ్లకి చెప్పారట.అయితే ఇటు రాజకీయ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి అలాగే అటు సినీ ఫ్యామిలీకి సంబంధించిన అబ్బాయి కావడంతో వీరిద్దరికీ మధ్య బంధుత్వం బాగా కుదిరిందట.ఇక ఆ ఆకాష్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తన డాడీకి ఒక్కత్తే కూతురని తెలుస్తోంది.

అలాగే వందల కోట్ల ఆస్తికి ఈమె వారసరాలని సమాచారం.త్వరలోనే ఆకాష్ పూరి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ వైరల్ గా మారింది.

అయితే వైరల్ అయ్యే ఈ న్యూస్ లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ చాలామంది నెటిజన్స్ అయితే ఆకాష్ పూరి ( Akash Puri) తంతే బూరెల బుట్టలో పడ్డట్టు మంచి ఫ్యామిలీలోకి అల్లుడుగా వెళ్లబోతున్నారు కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube