దమ్ముంటే డిసెంబర్ 31న ఇలా చెయ్యి.. పూరీ షాకింగ్ కామెంట్స్ వైరల్!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మనస్సులో ఉన్న విషయాలను తన వీడియోల ద్వారా వెల్లడిస్తారనే సంగతి తెలిసిందే.రేపటి నుంచి నాటకాలు ఆడొద్దని పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చారు.

 Puri Jagannath Shocking Comments Goes Viral In Social Media Details, Puri Jagann-TeluguStop.com

హ్యాపీగా ఉండటం మనందరి కోరిక అని పూరీ జగన్నాథ్ తెలిపారు.సంతోషంగా ఉండాలంటే ముందు కష్టం కూడా ఉండాలని పూరీ జగన్నాథ్ వెల్లడించారు.

కష్టం తర్వాతే సంతోషం వస్తుందని పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు.

రేపటిలో మనం ఆనందాల్ని వెతుక్కుంటామని వచ్చే సంవత్సరం కుమ్మేద్దాం అని అనుకుంటామని పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చారు.

నీకు దమ్ముంటే ఈరోజే కుమ్మేయాలని వచ్చే సంవత్సరం వరకు ఎందుకని పూరీ జగన్నాథ్ కామెంట్లు చేశారు.కొత్త సంవత్సరం కొన్ని తీర్మానాలను రాసి పెట్టుకుంటామని మందు మానేద్దాం పేకాట ఆపేద్దామని అనుకుంటామని నీకు దమ్ముంటే ఈరోజే డిసెంబర్ 31 సెలబ్రేట్ చేయడం ఆపేయ్ అని పూరీ జగన్నాథ్ కామెంట్లు చేశారు.

రేపటి ఆనందం కోసం ఈరోజు ఆనందాలను వదిలేస్తున్నావని పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చారు.ఈరోజు ఆనందంగా లేకపోతే న్యూ ఇయర్ ఎప్పుడూ బాగుండదని పూరీ జగన్నాథ్ కామెంట్లు చేశారు.ఈరోజు ఆనందం కోసం ఏదైనా చేయి తప్ప రేపటి న్యూ ఇయర్ కోసం ఏమీ చేయొద్దని పూరీ జగన్నాథ్ వెల్లడించారు.రేపు నా జీవితం బాగుంటుందని తాగొద్దని ఈ క్షణం బాగుంటుందని పూరీ జగన్నాథ్ అన్నారు.

రేపటి పేరు చెప్పి నాటకాలు ఆడొద్దని ఆనందం వర్తమానంలో ఉంటుంది తప్ప భవిష్యత్తులో ఉండదని పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చారు.హ్యాపీ నౌ ఇయర్ అంటూ పూరీ జగన్నాథ్ కామెంట్లు చేశారు.పూరీ మ్యూజింగ్స్ లో హ్యాపీ నౌ ఇయర్ అంటూ పోస్ట్ చేసిన ఈ వీడియోకు నెటిజన్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.పూరీ జగన్నాథ్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube