ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కెరీర్ తొలినాళ్లలో వరుస సినిమాలతో విజయాలను సొంతం చేసుకుని స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్నారు.దేశముదురు, పోకిరి, శివమణి మరికొన్ని సినిమాలు దర్శకునిగా పూరీ జగన్నాథ్ స్థాయిని పెంచాయి.
నేనింతే సినిమా ఫ్లాప్ అయినా ఈ సినిమాను పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన విధానం మాత్రం చాలామందిని ఆకట్టుకుందనే చెప్పాలి.
టెంపర్ సినిమాకు ముందు టెంపర్ సినిమా తర్వాత పూరీ జగన్నాథ్ ఖాతాలో సరైన హిట్ లేదు.
అయితే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పూరీ జగన్నాథ్ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు.ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో నిర్మాతలకు వ్యవహరించినా పూరీ జగన్నాథ్, ఛార్మిలకు మంచి లాభాలు వచ్చాయి.
అయితే గత కొన్ని సంవత్సరాలుగా పూరీ జగన్నాథ్, ఛార్మి మధ్య ఏదో ఉందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

లైగర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ వార్తల గురించి పూరీ జగన్నాథ్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.ఛార్మికి 13 సంవత్సరాల వయస్సు ఉన్నప్పటి నుంచి ఆమె నాకు తెలుసని పూరీ జగన్నాథ్ అన్నారు.ఛార్మికి నాకు అఫైర్ ఉందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయని ఛార్మి యంగ్ గా ఉండటం వల్లే అలాంటి రూమర్లు ప్రచారంలోకి వస్తున్నాయని పూరీ జగన్నాథ్ కామెంట్లు చేశారు.

ఛార్మి వయస్సు 50 సంవత్సరాలు అయితే ఈ విధంగా మాట్లాడేవారు కాదని పూరీ జగన్నాథ్ తెలిపారు.ఛార్మికి వేరేవాళ్లతో పెళ్లి జరిగి ఉన్నా ఇలాంటి కామెంట్లు వచ్చేవి కాదని పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చారు.నేను ఛార్మి ఒకే ఇండస్ట్రీలో ఉండటంతో పాటు చాలా సంవత్సరాలుగా ట్రావెల్ అవుతుండటం వల్ల ఈ వార్తలు వస్తున్నాయని పూరీ జగన్నాథ్ అన్నారు.అఫైర్ ఉన్నా ఎక్కువరోజులు నిలబడదని ఆకర్షణ కొన్నిరోజుల్లోనే చచ్చిపోతుందని పూరీ జగన్నాథ్ తెలిపారు.







