షాలిని పాండేకి లక్కీగా మారుతున్న పూరీ..!

అర్జున్ రెడ్డి సినిమాతో హీరోగా విజయ్ దేవరకొండకి ఒక బ్రాండ్ ఏర్పడగా ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలిని పాండేకి మాత్రం కెరియర్ అంత ఆశించిన స్థాయిలో లేదని చెప్పొచ్చు.

అమ్మడు చేసిన సినిమాలన్ని పెద్దగా గొప్ప ఫలితాలు దక్కించుకోలేదు.

అందుకే టాలీవుడ్ కన్నా బాలీవుడ్ మీద దృష్టి పెట్టింది షాలిని పాండే.అయితే ఇప్పుడు లేటెస్ట్ గా అమ్మడు ఓ లక్కీ ఛాన్స్ అందుకుందని టాక్.

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ తో అమ్మడు సినిమా చేస్తుందని టాక్.లైగర్ తర్వాత పూరీ మరోసారి ఇస్మార్ట్ శంకర్ అదేనండి రామ్ పోతినేనితో సినిమా చేస్తాడట.

సినిమాలో హీరోయిన్ గా షాలిని పాండే నటిస్తుందని తెలుస్తుంది.అదే నిజమైతే మాత్రం షాలినికి నిజంగానే ఇది క్రేజీ ఛాన్స్ అని చెప్పొచ్చు.

Advertisement

ఈమధ్య బొద్దుగా మారిన అమ్మడు దాన్ని చాలా సీరియస్ గా తీసుకుని స్లిమ్ గా మారినట్టు అర్ధమవుతుంది.మరి అమ్మడికి ఇక మీదట అయినా వరుస అవకాశాలు వస్తాయేమో చూడాలి.

రామ్ ప్రస్తుతం లింగుసామి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు.ఆ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా చేస్తుంది.

నడుము అందాలతో తెల్ల చీరలో క్యూట్​గా పూజా
Advertisement

తాజా వార్తలు