తెలుగు సినిమా ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్( Puri Jagannadh ) కి ప్రత్యేకమైన శైలి ఉంది.ఆయన తీసే సినిమాలకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది.ఇప్పటికీ ఎన్నోసార్లు పడి లేచిన కిరీటం లాగ పూరి జగన్నాథ్ కెరీర్ ఎన్నో అప్ అండ్ డౌన్స్ తో ముందుకు సాగుతూనే ఉంది.100 కోట్లకు పైగా ఆస్తిని పోగొట్టుకున్నాడు అది మళ్ళీ తిరిగి సంపాదించుకుంటున్నాడు.ఇది అతనికి కొత్తేమీ కాదు.బద్రి సినిమా( Badri )తో తన కెరీర్ ను ప్రారంభించి ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్ తీస్తున్నాడు.ఇక ఎంతో మంది నటీనటులను సినిమాల ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు పూరి జగన్నాథ్.అయితే తాను తీసిన సినిమాలలో చాలా మంది హీరోలకు కెరియర్ బెస్ట్ చిత్రాలను కూడా అందించాడు.
ఇక ఏదైనా సినిమా తీయాలని ఆలోచన రాగానే పూరీ జగన్నాధ్ బ్యాంకాక్ వెళ్లిపోయి పట్టాయా బీచ్ లో కూర్చుని కథలు రాస్తాడు అనే విషయం మనందరికీ తెలుసు.తనకు బీచ్ పక్కనే కూర్చోవడం అలాగే తన రిటైర్మెంట్ లైఫ్ కూడా బీచ్ దగ్గరలోనే ఉండాలని కోరుకుంటున్న విషయం కూడా మనకు తెలుసు.అయితే పూరి జగన్నాథ్ ఒక సినిమా తీయాలంటే ఎన్ని రోజులు కథ రాస్తాడు అనే విషయమే ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు.అయితే అందుకు సంబంధించిన వివరాలను పూరి ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడు.
మొదటగా సినిమా తీయాలని నిర్ణయించుకున్నాక బ్యాంకాక్ వెళ్లిపోయి కథ లైన్ మాత్రమే రాసుకొని ఇండియాకు తిరిగి వస్తాడట పూరి.దీని కోసం వారం రోజుల సమయం తీసుకుంటాడట.ఆ తర్వాత ఇండియాకి రాగానే నటీనటులు అందరినీ కూడా ఎంచుకొని యూనిట్ ని కూడా సిద్ధం చేసి తిరిగి బెంగళూరుకు వెళ్ళిపోతాడట.ఆ తర్వాత మరొక వారం రోజులు కూర్చొని డైలాగ్స్ రాసుకొని తిరిగి హైదరాబాద్( Hyderabad ) చేరుకొని సినిమా షూటింగ్ మొదలు పెడతాడట.
ఇలా కేవలం 15 రోజులు మాత్రమే ఏ సినిమా కోసమైనా కష్టపడతాడట పూరి.ఇప్పటివరకు తాను తీసిన అన్ని చిత్రాలకు ఇదే స్థాయిలో పని చేసాడట.అంతకుమించి ఒక్కరోజు కూడా కథ కోసం తీసుకోడట
.