డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ సినిమా ను రూపొందిస్తున్నాడు.రామ్( Ram Pothineni ) హీరోగా రూపొందుతున్న ఈ సినిమా లో హీరోయిన్స్ ఎవరు అనేది ఇంకా క్లారిటీ రాలేదు.
ఇస్మార్ట్ శంకర్ సినిమా( Ismart Shankar movie ) లో నభా నటేష్.నిధి అగర్వాల్ లు నటించారు.
వీరిద్దరు కూడా ఆ సినిమా లో అద్భుతమైన నటనతో మెప్పించడంతో పాటు ఆకట్టుకునే విధంగా అందాల ఆరబోత చేశారు.అందుకే డబుల్ ఇస్మార్ట్ లో కూడా వారే ఉంటే బాగుంటుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కానీ పూరి జగన్నాధ్ ( Puri Jagannath )మాత్రం ఈ సినిమా ను పాన్ ఇండియా రేంజ్ సినిమా గా రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.అందుకే డబుల్ ఇస్మార్ట్ లో ఇద్దరు హాట్ బాలీవుడ్ ముద్దుగుమ్మలను నటింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.కానీ పూరి గత చిత్రం లైగర్ ఫలితం.ఆ సినిమా లో నటించిన అనన్య పాండే పరిస్థితి చూసి చాలా మంది బాబోయ్ నీ ఇస్మార్ట్ కి ఓ దండం అంటూ తప్పుకుంటున్నారట.
ఆ మధ్య శ్రద్దా కపూర్( Shraddha Kapoor ) తో పాటు మరి కొందరు ముద్దుగుమ్మలను పూరి సంప్రదించాడు అంటూ వార్తలు వచ్చాయి.

కానీ ఏ ఒక్క హీరోయిన్ కూడా ఇప్పటి వరకు పూరికి ఓకే చెప్పలేదు.అయితే పూరి అడిగితే కాదనకుండా చేసే హీరోయిన్స్ చాలా మంది ఉన్నా కూడా ఆ కొందరు హాట్ బ్యూటీస్ ను పట్టుకుని ఆయన వేలాడుతున్నాడు అని.హిందీ లో కూడా పూరిని ఇష్టపడి ఆయన తో వర్క్ చేసేందుకు సిద్ధంగా ఉండే వారు ఉన్నారంటూ కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతానికి హీరోయిన్స్ లేని సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నాడు.త్వరలోనే తాను కోరుకున్నట్లుగానే హిందీ ముద్దుగుమ్మలను తీసుకుని షూటింగ్ మొదలు పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.