తెలంగాణలో ప్రజాపాలనను విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు.
రేపటి నుంచి ప్రజాపాలన సభలు ప్రారంభం కాగా జనవరి 6వ తేదీ వరకు కొనసాగనున్నాయి.ప్రజాపాలన సభల్లోనే అన్ని ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.
ఇందుకు అవసరమైన దరఖాస్తు ఫామ్ లను ప్రభుత్వమే అందిస్తుందని తెలిపారు.ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్ దారులకు ప్రతినెల ఒకటి నుంచి ఐదో తేదీలోపు జీతాలు అందే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.







