జూనియర్ ఎన్టీఆర్ ను అలా పిలవడం నాకు అస్సలు నచ్చదు: పృథ్వీ రాజ్ 

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఎన్టీఆర్( NTR )ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నారు.ఈయన రాజమౌళి దర్శకత్వంలో నటించిన ఆర్ఆర్ఆర్ ( RRR ) సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

 Pruthvi Raj Comments About Jr. Ntr, Pruthvi Raj, Ntr, Chandrababu Naidu, Tol-TeluguStop.com

ఇక ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకోవడంతో ఈయనకు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ లభించింది.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ నటించిన తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి.

ప్రస్తుతం ఈయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా( Devara Movie ) షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

Telugu Chandrababu, Devara, Pruthvi Raj, Rrr, Taraka Ramarao, Tollywood-Movie

ఇక ఎన్టీఆర్ తన సినిమా పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆయన గురించి మాత్రం సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ వస్తున్న సంగతి మనకు తెలిసిందే.తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీఆర్ మామ అయినటువంటి చంద్రబాబు( Chandra Babu ) అరెస్ట్ కావడంతో ఇప్పటికే పలువురు టిడిపి నేతలు నందమూరి కుటుంబ సభ్యులు కార్యకర్తలు కూడా స్పందించారు.అలాగే సినీ సెలబ్రిటీలు కూడా ఈ విషయంపై స్పందించి వారి అభిప్రాయాలను తెలియజేశారు.

అయితే ఇప్పటివరకు ఎన్టీఆర్ ఈ విషయంపై స్పందించకపోవడంతో ఆయన గురించి చాలా విమర్శలు వస్తున్నాయి.

Telugu Chandrababu, Devara, Pruthvi Raj, Rrr, Taraka Ramarao, Tollywood-Movie

ఇక తాజాగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగుతో ఎంతో ఫేమస్ అయినటువంటి పృథ్విరాజ్ ( Pruthvi Raj ) ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ విషయం గురించి తన అభిప్రాయాలను తెలియజేశారు.ఎన్టీఆర్ ఈ విషయం గురించి ఇప్పుడు మౌనంగా ఉండవచ్చు అయితే టిడిపిలో పెద్దలు ఉన్నారు అన్న కారణంతోనే ఆయన ఈ విషయంపై మాట్లాడలేదని,స్పందించాల్సిన సమయంలో తప్పకుండా స్పందిస్తారు అంటూ వెల్లడించారు.ఇక ఆయన ఇప్పుడు మాట్లాడకపోయినా భవిష్యత్తులో ఏదైనా ఇంటర్వ్యూలలో పాల్గొన్న ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి వస్తుందంటూ ఈయన తెలిపారు.

ఇక ఎన్టీఆర్ ను అందరూ ఎన్టీఆర్ అని పిలుస్తారు.నాకు మాత్రం ఆయనని అలా పిలవడం ఏమాత్రం నచ్చదని తనని నందమూరి తారక రామారావు ( Taraka Ramarao ) అని పిలిస్తేనే నచ్చుతుంది అంటూ ఈ సందర్భంగా పృథ్విరాజ్ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube