సినీ ఇండస్ట్రీలో నేచురల్ బ్యూటీగా ఎంతమంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేద.హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొంతకాలానికి ఈమె స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇలా హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి సాయి పల్లవి( Sai Pallavi ) గురించి కథ కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టిన ఈమె పెళ్లి చేసుకోబోతుంది అంటూ కొన్ని రోజులు వార్తలు రాగా ఇప్పుడు మాత్రం సాయి పల్లవి రహస్యంగా ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకుంది అంటూ మెడలో దండ వేసుకుని మరో వ్యక్తితో కలిసి ఉన్నటువంటి ఫోటోని వైరల్ చేస్తున్నారు.
ఇక ఈ ఫోటోపై డైరెక్టర్ వేణు ఊడుగుల( Venu Udugula ) స్పందించి క్లారిటీ ఇచ్చారు.సాయి పల్లవి సినిమా పూజా కార్యక్రమాలలో భాగంగా దిగిన ఫోటోని ఇలా పెళ్లి చేసుకుంది అంటూ ప్రచారం చేస్తున్నారని ఆయన ఈ ఒక్క ఫోటోతో క్లారిటీ ఇచ్చేశారు.తాజాగా సాయి పల్లవి తన పెళ్లి గురించి వస్తున్నటువంటి ఈ రూమర్లపై స్పందించారు.
సోషల్ మీడియా వేదికగా సాయి పల్లవి స్పందిస్తూ సాధారణంగా నేను తన గురించి వచ్చే రూమర్లను ఏమాత్రం పట్టించుకోనని తెలిపారు.కానీ నా గురించి మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులు మిత్రులను కూడా ఇన్వాల్వ్ చేస్తూ వార్తలు రాస్తున్నారు.
ఇలా వారందరిని ఇన్వాల్వ్ చేయడంతో స్పందించక తప్పలేదని ఈమె తెలిపారు.కొందరు చెడు ఆలోచనలతో ఒక సినిమా పూజ కార్యక్రమంలో దిగిన ఫోటోని కట్ చేసి పెళ్లి చేసుకున్నాను అంటూ చిల్లర రాతలు రాస్తున్నారు.ఒక మంచి విషయాన్ని అభిమానులతో పంచుకుంటే దాన్ని ఇలా పక్కదారి పట్టించడం క్షమించరాని నేరం అంటూ ఈ సందర్భంగా సాయి పల్లవి తన పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలపై ఘాటుగా స్పందిస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే ఈమె తమిళంలో శివ కార్తికేయన్ (Shiva Karthikeyan) సరసన ఒక సినిమాలో నటిస్తున్నారు.
అలాగే తెలుగులో నాగచైతన్య (Nagachaitanya) చందు మొండిటి దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమాలో నటిస్తున్నారు.