8వ అంతర్జాతీయ యోగా దినోత్సం కేంద్ర పోర్టులు షిప్పింగ్ మరియు జలరవాణా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు.విశాఖపట్నం పోర్టు అధారిటీ, కేంద్ర ఆయుష్ విభాగం, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.
కేంద్ర పోర్టులు, షిప్పింగ్ మరియు జలరవాణా శాఖ సహాయ మంత్రి శ్రీ శాంతనూ ఠాకూర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ముందుగా ఆర్కే బీచ్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విశాఖపట్నం పోర్టు మరియు జిల్లా యంత్రంగా ఏర్పాట్లు చేయగా వాతావరణం అనుకూలించ పోవడంతో వేదికను స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంకు మార్చారు.
ఈ కార్యక్రమానికి యోగా ప్రియులు విశాఖ పరిసర ప్రాంత వాసులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.ఆంధ్రా యూనివర్శిటీ యోగా విభాగం అధ్యాపకులు ఆహూతులతో యోగాసనాలు వేయించారు.
పాల్గొన్న వారంతా ఉత్సాహంగా వివిధ యోగా భంగిమలను అధ్యాపకులతో కలిసి వేశారు.కామన్ యోగా ప్రొటోకాల్ ను అనుసరించి కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంతరం బ్రహ్మకుమారిస్ సిస్టర్ ఆహూతులతో మెడిటేషన్ చేయించారు.
కార్యక్రమాన్ని కొనసాగిస్తూ కేంద్ర సాహాయ మంత్రి చేతుల మీదుగా వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా పోర్టు పలు పోటీలను నిర్వహించింది.ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు మంత్రి బహుమతులు అందజేశారు.
అనంతరం సామాజిక బాధ్యతలో భాగంగా విశాఖపట్నం పోర్టు పలువురు లబ్ధిదారులకు మంత్రి చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేసింది.అనంతరం జాతీయ గీతాలాపనతో కార్యక్రమాన్ని ముగించారు.
ఈ కార్యక్రమంలో పోర్టు చైర్మన్ శ్రీ కె రామమోహనరావు, ఐఏఎస్ , దుర్గేష్ కుమార్ దూబె , ఐఆర్ టిఎస్, శ్రీ జే ప్రదీప్ కుమార్ , ఐఆర్ ఎస్ ఎంఈ, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్, విశాఖ జిల్లా కలెక్టర్ శ్రీ ఏ మల్లి ఖార్జున, జివిఎంసి కమీషనర్ లక్ష్మీ షా, విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ విశ్వోనాధన్ , ఐఏఎస్, విశాఖ మేయర్ శ్రీమతి హరి వెంకట కుమారి, ఎంఎల్సీలు శ్రీమతి వరుదు కళ్యాణి, శ్రీ పివిఎన్ మాధవ్ లు పాల్గొన్నారు.కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం పట్ల కేంద్ర మంత్రిత్వ శాఖ పోర్టు చైర్మన్ ను ప్రత్యేకంగా అభినందించింది.
ముఖ్యంగా వర్షం కురిసినప్పటికీ వేదికను మార్చి యుద్ద ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది.







