అల్లూరి జిల్లా.కామయ్యపేట రోడ్డు తక్షణమే మరమ్మత్తు చేయాలని,రోడ్లో వల వేసి చేపలు పడుతూ నిరసన తెలుపుతున్న:మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ అరకు నియోజకవర్గం హుకుంపేట మండలం కామయపేట ప్రధాన రోడ్డు దిగుడుపుట్టు బ్రిడ్జి దగ్గర రోడ్డు చాలా అధ్వానంగా ఉందని తక్షణమే మరమ్మత్తు చేయాలని అరకు నియోజకవర్గ ఇన్చార్జి మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ టీడీపీ మండల నాయకులతో కలిసి రోడ్లో వల వేసి రోడ్లు తక్షణమే మరమ్మత్తు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు అనంతరం మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దిగుడుపుట్టు బ్రిడ్జినీ కోట్ల రూపాయలతో బ్రిడ్జి రోడ్డు సౌకర్యం కల్పించారని తదనంతరం సుమారుగా మూడు పంచాయితీలకు రహదారి సౌకర్యం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీయేననీ నేడు రాష్ట్ర వైసిపి ప్రభుత్వం కనీసం గుంతలు పడిన రోడ్లు మరమ్మతులు చేయలేని దుస్తితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని రోడ్లలో తిరుగుతుంటే అది రోడ్ల లేక సముద్రలుగా తలపిస్తోందని రోడ్లలో చేపలు పట్టుకునే పరిస్తితి ఆంధ్ర రాష్ట్రంలో నెలకొందని గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధికి కృషి చేసింది తెలుగుదేశం పార్టీయేనని.
నాడు వైసిపి ప్రభుత్వం కనీసం గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధినీ విస్మరించిందని ప్రజలందరు గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే గుంతలు పడిన రోడ్లను మరమ్మతులు చేయలేని రోడ్లో వల వేసి చేపలు పడుతూ నిరసన తెలుపుతు ప్రభుత్వాన్ని మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల జనరల్ సెక్రటరీ సూర్యకాంతం,రాష్ట్ర ఎస్టీ సెల్ ఆర్గనైజర్ సెక్రటరీ సాగర సుబ్బారావు,మండల తెలుగు యువత అధ్యక్షుడు పల్టాసింగి కామేశ్వరారవు,బాకురు సర్పంచ్ బాకురు వెంకటరమణ రాజు,తీగలవలస వైస్ ప్రెసిడెంట్ పాంగి రామరావు,వార్డు మెంబర్ వెంకట్,గన్నేరుపుట్టు ఎంపీటీసీ అభ్యర్థి తామర్ల సుబ్బారావు,గ్రామ టీడీపీ నాయకులు కిలో సుబ్బారావు,కిలోరంగారావు,సిదరి మత్యారాజు, పాంగి చిట్టిబాబు,పాంగి త్రినాథ్, సిదరీ కామేష్,హరి,దారెల సర్పంచ్ పాంగి పాండురంగ స్వామి,అరకు నియోజకవర్గ ఐటీడీపి కో కన్వీనర్ శివ సాగర్,త్రినాథ్, మురళి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…
.






