వ్యభిచారం చేసాననడం వింత అనుభవం అంటున్న హీరోయిన్

“ఎక్కడా….” అంటూ టీనేజ్ వయసులోనే తెలుగు ప్రేక్షకులని పలకరించి, కొత్త బంగారు లోకం లాంటి భారీ హిట్ తో తన ఖాతా మొదలుపెట్టింది శ్వేతాబసు ప్రసాద్.బాల్యంలోనే జాతీయ అవార్డు పొందిన నటి కావడం, తొలిచిత్రమే అంత పెద్ద సక్సెస్ కావడం, శ్వేతా అందంతో పాటు అభినయానికి కూడా మంచి మార్కులు పడటంతో, ఈ అమ్మడు కెరీర్ లో చాలా ఎత్తుకు ఎదుగుతుందని అనుకున్నారంతా.కాని అలాంటిదేమి జరగలేదు.

 Prostitution Controversy Was Like An Adventure – Shweta Basu-TeluguStop.com

కొత్త బంగారు లోకం తరువాత శ్వేతా కెరీర్ ఊపందుకోలేదు.ఆ తరువాత చేసిన సినిమాలన్ని ఎలా వచ్చి ఎలా వెళ్ళాయో కూడా ఎవరికి గుర్తులేదు.

అలాంటి సమయంలోనే శ్వేతాని వ్యభిచారం వివాదం చుట్టుముట్టింది.కొంతకాలం తరువాత శ్వేతాకి క్లీన్ చిట్ రావడం, ఆ తరువాత ఒక యూట్యూబ్ ఛానెల్ లో, అలాగే హిందీ సీరియల్స్ లో అవకాశాలు రావడం చకచకా జరిగిపోయాయి.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో శ్వేతా వ్యభిచారం కేసు మళ్ళీ చర్చకు వచ్చింది.దానికి ఈ నటి ” పెద్దగా కారణాలు లేకుండానే మీడియా ఆ వివాదానికి ప్రధాన్యతనిచ్చింది.

చిన్న విషయాన్ని హాడావుడితో పెద్దగా చేసారు.అయితే ఒకప్పుడు నేను కూడా జర్నలిస్టునే.

జనాలను ఆకట్టుకోవడానికి కథలు ఎలా అల్లుతారో నాకు తెలుసు.నాకు ఇలాంటి టాపిక్ దొరికినా, నేను అలానే రాసుండేదాన్ని.

వారి పని వారు చేసారు.అలాగే నేను ఆ వివాదం ముగిసాక రాసిన ఉత్తరాన్ని కూడా అందరికి తెలియజేసింది మీడియా.

నాకు క్లిన్ చిట్ వచ్చిందన్న విషయం అందరికీ తెలుసు.నన్ను అపార్థం చేసుకున్నారు.

అందరకిి ఏదో ఒక సమస్య ఎదురవుతుంది.అవి వింత సవాలు లాంటివి.

నా విషయంలో ఇలాంటిది జరిగింది.అయితే కష్టకాలంలో నా కుటుంబం, స్నేహితులు నాకు అండగా నిలిచారు” అంటూ సమాధానమిచ్చింది శ్వేత.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube