Rice Crop : వరి పంటను పొట్ట కుళ్ళు తెగుళ్ల బెడద నుంచి సంరక్షించే యాజమాన్య పద్ధతులు..!

భారతదేశంలో ప్రధాన ఆహార పంట వరి పంట( Rice crop ).భారతదేశంలో సాగు విస్తీర్ణంలో నాల్గవ వంతు విస్తీర్ణంలో వరి పంట సాగు అవుతుంది.

 Proprietary Methods To Protect The Rice Crop From The Pest Of Stomach Bugs-TeluguStop.com

వరి ఉత్పత్తిలో చైనా తర్వాత భారతదేశం రెండవ స్థానంలో ఉంది.భారతదేశంలో వరి పంట ఎక్కువగా ఖరీఫ్ లో సాగు అవుతుంది.

వరి పంట సాగుకు తేమ మరియు వేడి వాతావరణం, ఉష్ణ, ఉపఉష్ణ మండలం చాలా అనుకూలం.అయితే వరి పంటకు చీడపీడల, తెగుళ్ల బెడద( Pests ) చాలా ఎక్కువ.

రైతులు సకాలంలో వీటిని గుర్తించి నివారణ చర్యలు చేపట్టిన కొంత మేర నష్టం వాటిల్లే అవకాశం ఉంది.కాబట్టి వరి పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే సాగుకు ముందే సాగు విధానంపై అవగాహన కల్పించుకుని, సరైన యాజమాన్య పద్ధతులను మెలుకువలతో పాటు పాటిస్తే ఆశించిన స్థాయిలో అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ క్షేత్ర నిపుణులు( Agricultural experts ) సూచిస్తున్నారు.

Telugu Agricultural, Dhanustin, Kavach, Konica, Crop, Stomach Bugs, Tata Master-

వరి పంట సాగుకు తెగులు నిరోధక ఆరోగ్యకరమైన విత్తనాలను ఎంపిక చేసుకొని, ఆరోగ్యకరమైన నారును మాత్రమే ప్రధాన పొలంలో నాటుకోవాలి.పొలంలో కలుపు సమస్య లేకుండా ఎప్పటికప్పుడు తొలగించాలి.వరి పంటకు తీవ్ర నష్టం కలిగించే తెగుళ్ల జాబితాలో పొట్ట కుళ్ళు తెగుళ్లు కూడా ఉంది.ఈ పొట్ట కుళ్ళు తెగుళ్లు ఆశిస్తే వరి మొక్క ఆకుల పై భాగం గోధుమ రంగులోకి మారుతుంది.

అంతేకాదు తెగుళ్లు ఆశించిన ఆకు లోపల తెల్లటి పొడి శీలింద్రాలను గమనించవచ్చు.

Telugu Agricultural, Dhanustin, Kavach, Konica, Crop, Stomach Bugs, Tata Master-

తడి వాతావరణ పరిస్థితులలో ఈ తెగుళ్లు పంటను ఆశించే అవకాశం ఉంది.అధిక నత్రజని ఉపయోగిస్తే కూడా ఈ తెగుళ్లు సోకే అవకాశం ఉంది.మొక్కలకు గాయాలయితే ఆ గాయాల ద్వారా ఈ తెగులు ఆశించే అవకాశం ఉంది.

ఈ తెగుళ్లను గుర్తించిన తర్వాత ధనుస్టిన్, కవాచ్, టాటా మాస్టర్, కొనికా అనే రసాయన మందులలో ఏదో ఓ రసాయనమందును పిచికారి చేసి తెగుళ్లను పూర్తిగా నివారించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube