చీడపీడలు, తెగుళ్ల నుండి బీడీ పొగాకు పంటలను సంరక్షించే యాజమాన్య పద్ధతులు..!

ఆంధ్రప్రదేశ్ లోని నల్లరేగడి నేలలలో బీడి, సిగరెట్ ( Bidi, cigarette )లలో వాడే నాటు పొగాకు ఎక్కువగా సాగు చేస్తున్నారు.ఈ పొగాకు ను వర్షాధారపు పంటగా చెప్పుకోవచ్చు.

 Proprietary Methods Of Protecting Beedi Tobacco Crops From Pests And Diseases ,-TeluguStop.com

అదే తేలికపాటి నేలల్లో అయితే నీటిపారుదల ద్వారా సాగు చేయవచ్చు.పొగాకు పంటను చీడపీడల నుండి సంరక్షించుకోవడం కోసం చేపట్టాల్సిన చర్యలు: పంట వేశాక పొగాకు మొక్కలపై లద్దె పురుగులు గుడ్లు పెట్టి, మొక్క ఆకులను జల్లెడ ఆకులు చేసి నాశనం చేస్తాయి.అయితే పొగాకు పంట వేసే 15 రోజుల ముందే పొలం చుట్టూ ఆముదము విత్తనాలు నాటాలి.ఈ ఆముదపు మొక్కలు లద్దె పురుగులను ఆకర్షిస్తాయి.ఇక ఒక హెక్టార్ కు దాదాపు పది లింగాకర్షక బుట్టలు అమర్చుకోవాలి.లీటరు నీటిలో 0.3 మి.లీ.క్లోరాంట్రానిలిప్రోల్ కలిపి మొక్కలు బాగా తడిచేలాగా పిచికారి చేయాలి.

పిల్ల మరియు పెద్ద పురుగులు మొక్కల రసాన్ని పీల్చడంతో మొక్క పై నల్లని బంక( Black glue ) ఏర్పడి మొక్క చనిపోతుంది.ఈ మొక్క ఆకులు క్యూర్ చేయడానికి పనికిరావు.కాబట్టి మొక్కలకు పెనుబంక నుండి రక్షించడం కోసం ఒక లీటరు నీటిలో 200 ఎస్.ఎల్ ఇమిడా క్లోప్రిడ్ తో పంటకు పిచికారి చేయాలి.పిండి నల్లి పురుగులు పంటను ఆశించకుండా ఎసిఫేట్ 75% పొడి మందు 15 గ్రాములు పది లీటర్ల నీటిలో కలిపి పంటకు పిచికారి చేయాలి.

తెల్ల దోమలు పంటను ఆశించకుండా ఎకరం పొలంలో ఓ నాలుగు పసుపు రంగు ట్రాపులను ఏర్పాటు చేయాలి.వీటి నివారణకు లీటరు నీటిలో 0.3 మిల్లీలీటర్ల ఇమిడా క్లొప్రిడ్ కలిపి పిచికారి చేయాలి.మాగుడు తెగుళ్లు పంటను ఆశించకుండా విత్తనాలు మొలకెత్తిన 20 రోజుల తర్వాత పది లీటర్ల నీటిలో రిడోమిల్ ఎం.జెట్ 72, డబ్ల్యూ.పి.మందు 20 గ్రా పంటకు పిచికారి చేయాలి.ఆకుపచ్చ తెగుళ్లు పంటను ఆశించకుండా ఉండాలంటే పంట వేయకముందే మొదలులో కాపర్ ఆక్సి క్లోరైడ్ 0.2% 100 మిల్లీలీటర్లు పోయాలి.పైన చెప్పిన పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడి ఆశించవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube