సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినీ జగత్తు లో వెలుగు వెలిగిన విషయం తెల్సిందే.ఆయన ఒక గొప్ప నటుడు మాత్రమే కాకుండా గొప్ప వ్యక్తి అంటూ చాలా మంది ఆయన సన్నిహితులు అంటూ ఉంటారు.
గొప్ప టెక్నీషియన్ అయిన సూపర్ స్టార్ కృష్ణ ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుండి కూడా పెద్ద ఎత్తున సంపాదన కలిగి ఉన్నారు.అందుకే ఆయన వందల కోట్ల ఆస్తులను కూడబెట్టారు.
అయితే మొదటి భార్య ఇందిరా దేవి మాత్రమే కాకుండా ఆయనకు విజయ నిర్మల కూడా భార్య అవ్వడం వల్ల ఆయన ఆస్తుల విషయంలో తగాదాలు వచ్చాయి అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.కానీ కృష్ణ యొక్క ఆస్తుల విషయంలో ఎప్పుడు కూడా తగాదాలు రాలేదు.
కృష్ణ యొక్క ఆస్తిని కొన్ని సంవత్సరాల క్రితమే పంచేశారు.పెద్దబ్బాయి రమేష్ బాబు మరియు చిన్నబ్బాయి మహేష్ బాబు కు సమానంగా వాటాలు ఇవ్వడంతో పాటు కూతుర్లకు కూడా కొంత మొత్తంలో ఆస్తిని కృష్ణ ఇచ్చారట.

ఆయన చనిపోయే సమయంలో ఆయన నివాసం ఉన్న ఒక్క ఇంటి విషయంలోనే చర్చ జరిగింది.ఆ ఇల్లు విజయ నిర్మల కొడుకు నరేష్ కు చెందినదిగా ప్రచారం జరుగుతోంది.ఆ ఇల్లు విషయం లో కృష్ణ వారసులు ఏ ఒక్కరు కూడా కనీసం మాట్లాడలేదట.అందుకే వివాదం అనేది లేకుండానే ఆస్తుల విషయాలు తేలాయి.కృష్ణ సోదరుడు ఈ విషయాలను చక్క బెట్టారు అనేది టాక్.

ఇక మహేష్ బాబు భారీ ఎత్తున సంపాదిస్తున్నాడు.కనుక ఆయనకు ఆస్తుల విషయంలో గొడవ పడాల్సిన అవసరం లేదు.తండ్రి ఇచ్చిన ఆస్తికి రెట్టింపు ఆస్తిని ఇప్పటికే మహేష్ బాబు సంపాదించాడు.
అలాగే రమేష్ బాబు కూడా వ్యాపారాలతో పెద్ద ఎత్తున సంపాదించి కుటుంబానికి అందించి చని పోయాడు.కనుక కృష్ణ ఆస్తి తగాదాలు ఏమీ లేవు.







