'ప్రాజెక్ట్ కే'లో ప్రభాస్ ఒరిజినల్ లుక్ ఇదే.. పోస్టర్ వైరల్!

ప్రాజెక్ట్ కే( Project-K ) నుండి నిన్న సాయంత్రం ఎట్టకేలకు డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ కే సినిమా నుండి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫస్ట్ లుక్ అయితే వచ్చేసింది.

ఈ లుక్ కోసం ఫ్యాన్స్ ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నారు.

ఎట్టకేలకు లుక్ నిన్న రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.అయితే ఈ లుక్ ముందుగా అందరికి షాక్ ఇచ్చింది అనే చెప్పాలి.

ఎడిటింగ్ కాస్త తేడాగా ఉంది అనే టాక్ వచ్చింది.దీంతో ఈ పోస్టర్ కు మిక్స్డ్ టాక్ వచ్చింది.

అయితే ప్రభాస్ ను ఈ సినిమాలో నాగ్ అశ్విన్ ప్రజెంట్ చేసే విధానం గురించి అందరిలో క్యూరియాసిటీ మరింత పెరిగింది అనే చెప్పాలి.మరి ఫ్యాన్స్ ఎడిటింగ్ లో తేడా ఉందని టాక్ రాగా ఇప్పుడు మరో పోస్టర్ ను వైరల్ చేసేస్తున్నారు.

Advertisement

ఈ పోస్టర్ మాత్రం పెర్ఫెక్ట్ అని అంటున్నారు.ఇది ఎలాంటి ఎడిటింగ్ లేకుండా ప్రభాస్( Prabhas ) పెర్ఫెక్ట్ లుక్ లో కనిపిస్తున్నాడు.దీంతో ఈ ఒరిజినల్ పోస్టర్ ను ఫ్యాన్స్ తెగ వైరల్ చేసేస్తున్నారు.

ఎడిటింగ్ హెవీగా ఉన్న దాని కంటే ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది.జులై 20న యూఎస్ లో, 21న ఇండియాలో ఈ సినిమా నుండి టైటిల్ అండ్ టీజర్ రాబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసారు.

దీంతో రేపటి కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.ఇక ఇందులో బిగ్ బి అమితాబ్ బచ్చన్, ( Amitabh Bachchan )దిశా పటానీ, కమల్ హాసన్ వంటి స్టార్స్ భాగం అవ్వడంతో ఈ సినిమాపై మరింత ఈగర్ గా అన్ని ఇండస్ట్రీల వారు ఎదురు చూసేలా చేస్తున్నారు.డైరెక్టర్ నాగ్ అశ్విన్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై 500 కోట్ల భారీ బడ్జెట్ తో అశ్వనీ దత్ నిర్మిస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఇక ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.

Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn
Advertisement

తాజా వార్తలు