'ప్రాజెక్ట్ కే' నుండి దీపికా ఫస్ట్ లుక్.. ఆకట్టుకుంటున్న బ్యూటీ!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ) హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ ”ప్రాజెక్ట్ కే”.( Project K ) పాన్ వరల్డ్ మూవీగా టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

 Project K Deepika Padukone Looks Intense In First Look Poster, Prabhas, Project-TeluguStop.com

ఇందులో బిగ్ బి అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, కమల్ హాసన్( Kamal Haasan ) వంటి స్టార్స్ భాగం అయ్యారు.దీంతో ఈ పాన్ వరల్డ్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

బిగ్గెస్ట్ విజువల్ ట్రీట్ ను ప్రేక్షకుల కోసం సిద్ధం చేస్తున్నాడు నాగ్ అశ్విన్( Nag Ashwin ).ఇదిలా ఉండగా జులై 20 కోసం ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.అందుకు కారణం అదే రోజు ఈ సినిమా నుండి టైటిల్ అండ్ టీజర్ రాబోతున్నాయి కాబట్టి.జులై 20, 21న ఈ సినిమా నుండి టైటిల్ అండ్ టీజర్ రాబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసారు.

మరి ఈ లోపు లోనే మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.ప్రాజెక్ట్ కే నుండి దీపికా పదుకొనె లుక్( Deepika Padukone First Look ) ను రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు.

ఈ పోస్టర్ లో దీపికా లుక్ అందరిని ఆకర్షిస్తుంది.న్యాచురల్ అందంతో దీపికా అందరిని ఆకట్టు కుంటుంది.

టైటిల్ అండ్ టీజర్ కంటే ముందుగానే దీపికా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఆడియెన్స్ ను ఆకట్టు కోవడంతో మేకర్స్ సఫలం అయ్యారు.

శాన్ డియాగో కామిక్ కాన్( San Diego Comic Con ) అనే ప్రపంచ ప్రఖ్యాత వేదికపై అట్టహాసంగా టైటిల్ అండ్ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.కాగా ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై 500 కోట్ల భారీ బడ్జెట్ తో అశ్వనీ దత్( Ashwinidutt ) నిర్మిస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఇక ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube