పది నెలల పాటు థియేటర్లు మూత బడి ఉండటం వల్ల థియేటర్ల యాజమాన్యాలు మరియు నిర్మాతలు సినిమా పరిశ్రమకు చెందిన అందరు కూడా చాలా నష్టపోయారు.ఎట్టకేలకు థియేటర్లు ఓపెన్ కు ప్రభుత్వం నుండి అనుమతులు వచ్చాయి.
కాని మొత్తం దేశంలో కూడా అన్ని థియేటర్లను కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతో నడుపుకోవాలంటూ ఆదేశాలర జారీ చేయడం జరిగింది.ఇలా 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్ల ను ఓపెన్ చేయడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా ఉందని ఈ నెల రోజుల్లో వెళ్లడి అయ్యింది.
అందుకే నిర్మాతలు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అంతా కూడా ప్రభుత్వాలను థియేటర్లపై ఉన్న ఆంక్షలు ఎత్తివేయాలని 50 శాతం ఆక్యుపెన్సీని తొలగించాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు.

నిర్మాతల న్యాయబద్దమైన కోరికను ప్రభుత్వా లు పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అంటున్నారు.థియేటర్లను 50 శాతం ఆక్యుపెన్సీతో నడిపినా 100 శాతం ఆక్యుపెన్సీ తో నడిపినాకూడా పెద్దగా తేడా ఏమీ ఉండదు.కనుక 50 శాతం ఆక్యుపెన్సీ వల్ల పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు కనుక పూర్తిగా ఆంక్షలు ఎత్తివేయడం వల్ల నిర్మాతలకు మరియు థియేటర్ల యాజమాన్యాలకు ప్రయోజనం చేకూరుతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
విజయ్ నటించిన మాస్టర్ సినిమా విడుదలకు సిద్దం అవుతుంది.ఆ సినిమాను తమిళనాడులో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.50 శాతం ఆక్యుపెన్సీ కండీషన్స్ ను ఎత్తివేయాలంటూ ఆయన సీఎంను కోరాడు.అందుకు సీఎం ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.
కొత్త సినిమాను భారీ బడ్జెట్ సినిమాను 50 శాతం ఆక్యుపెన్సీతో విడుదల చేయడం వల్ల నష్టం వాటిల్లుతుంది.అందుకే నిర్మాతల కోరిక మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.