దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సమంత ప్రస్తుతం మయూసైటిస్ వ్యాధితో బాధపడుతూ తాను కమిట్ అయిన సినిమాలు అన్నింటికి దూరంగా ఉన్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే సమంత కమిట్ అయిన సినిమాల నుంచి తనని తప్పించారని ఆమె స్థానంలో మరొక హీరోయిన్లను సంప్రదించారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
అయితే ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని కొద్ది రోజుల విరామం తర్వాత తిరిగి సమంత సినిమా షూటింగులలో పాల్గొంటుందని తన మేనేజర్ వెల్లడించారు.
ఇక సమంత వ్యాధితో బాధపడుతున్న సమయంలోనే ఆమె యశోద సినిమాలో నటించారు.
అదేవిధంగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన శాకుంతలం సినిమాలో కూడా నటించారని తెలియజేశారు.ఇకపోతే సమంత యశోద సినిమా విడుదలై మంచి ఆదరణ సంపాదించుకుంది.
అయితే ఈ సినిమా కన్నా ముందుగా నటించిన శాకుంతలం సినిమా మాత్రం విడుదలకు మరికాస్త ఆలస్యం అవుతుంది.ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ను నిర్మాత నీలిమ గుణ తెలియజేశారు.

శాకుంతలం సినిమాని పాన్ ఇండియా స్థాయిలో నిర్మాత దిల్ రాజుతోపాటు నీలిమ సంయుక్తంగా నిర్మించారు.ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయాలని ఆలోచనలు నిర్మాతలు ఉన్నట్టు సమాచారం.అయితే ప్రస్తుతం ఈ సినిమా 3D టెక్నాలజీతో రూపొందిస్తున్నారని నీలిమ తెలియజేశారు.అయితే ఈ చిత్రాన్ని 3D టెక్నాలజీలోనే ఎందుకు చూడాలి అని నెటిజన్ ప్రశ్నించగా అందుకు నీలిమ వివరణ కూడా ఇచ్చారు.
శాకుంతలం సినిమా ఒక అందమైన ప్రేమ కథ.ప్రకృతి ఒడిలో అందంగా సాగిపోయే ఈ సినిమా జంతువులు ప్రకృతితో ప్రేమించబడినది.ప్రకృతిలో ఒదిగిపోయిన శాకుంతలం దుష్యంతుడి అద్భుతమైన ప్రేమ కథను 3D టెక్నాలజీలోనే చూసి ఎక్స్పీరియన్స్ చేయాలని ఈ సందర్భంగా నీలిమ ఈ సినిమా గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







