నరేష్ నాలుగో పెళ్లిపై నిర్మాత సంచలన వ్యాఖ్యలు.. పవన్ మూడు పెళ్లిళ్లంటూ?

సీనియర్ నరేష్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకోగా వేర్వేరు కారణాల వల్ల ముగ్గురు భార్యలతో విడిపోయిన సంగతి తెలిసిందే.అయితే నరేష్ పవిత్ర లోకేశ్ త్వరలో పెళ్లి చేసుకోనున్నారంటూ వైరల్ అయిన వార్తల వల్ల అటు నరేష్ గురించి ఇటు పవిత్ర లోకేశ్ గురించి ఇండస్ట్రీలో జోరుగా చర్చ జరుగుతోంది.

 Producer Natti Kumar Shocking Comments About Pawan And Naresh Marriages Details,-TeluguStop.com

తాజాగా నట్టికుమార్ నరేష్, పవిత్ర లోకేశ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

మీడియా నట్టి కుమార్ తో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకుంటే ఇండస్ట్రీలో దుమారం రేగిందని ప్రశ్నించింది.

ఆ ప్రశ్నకు నట్టి కుమార్ స్పందిస్తూ ఎవరిష్టం వారిదని పెళ్లి అనేది పర్సనల్ విషయమని తెలిపారు.బయటివాళ్లు చేస్తే అస్సలు పట్టించుకోరని సెలబ్రిటీలు చేస్తే మాత్రం మీడియా హడావిడి ఉంటుందని నట్టి కుమార్ కామెంట్లు చేశారు.

పవిత్ర లోకేశ్, నరేష్ వ్యవహారం గురించి మనం మాట్లాడకూడదని ఆయన అన్నారు.

నరేష్ కు పిల్లలు ఉన్నారని ఆయనకు మూడు పెళ్లిళ్లు జరగడం నిజమేనని నట్టి కుమార్ చెప్పుకొచ్చారు.

Telugu Marriages, Naresh, Pavitra Lokesh, Pawan, Pawan Kalyan, Pawan Marriages,

పవిత్ర లోకేశ్ కు రెండు పెళ్లిళ్లు జరిగాయని తెలుస్తోందని ఆయన తెలిపారు.నరేష్, పవిత్ర మంచి ఆర్టిస్టులని ఇద్దరూ సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారని నట్టి కుమార్ తెలిపారు.నరేష్, రమ్య రఘుపతి అధికారికంగా మ్యారేజ్ చేసుకున్నారని నట్టి కుమార్ చెప్పుకొచ్చారు.

Telugu Marriages, Naresh, Pavitra Lokesh, Pawan, Pawan Kalyan, Pawan Marriages,

రమ్య బ్లాక్ మెయిల్ చేసిందని నరేష్ చెబుతున్నారని భార్య భర్తను ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తుందని నట్టికుమార్ ప్రశ్నించారు.ఏదైనా సమస్య ఉంటే రమ్య, నరేష్ కలిసి మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలని నట్టి కుమార్ కామెంట్లు చేశారు.ఇలాంటి విషయాలు బయటకు వచ్చిన సమయంలో ఇండస్ట్రీ చులకన అవుతుందని నట్టి కుమార్ చెప్పుకొచ్చారు.

నట్టి కుమార్ చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube