నుపుర్ శర్మ కేసులో సుప్రీంకోర్టు మరో నిర్ణయం..

మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో సస్పెండైన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మపై ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానం లక్ష్మణ రేఖ దాటిందని.

 Another Decision Of Supreme Court In Nupur Sharma Case , Supreme Court, Nupur S-TeluguStop.com

దానిని సరిదిద్దేందుకు తక్షణం చర్యలు అవసరమని కొంతమంది మాజీ న్యాయమూర్తులు, మాజీ ఉన్నతాధికారులు విమర్శించారు.ఈ మేరకు 15 మంది మాజీ న్యాయమూర్తులు, 77 మంది ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ మాజీ అధికారులు, సాయుధ బలగాలకు చెందిన 25 మంది రిటైర్డ్‌ అధికారులు బహిరంగ లేఖ రాశారు.

దేశంలోని అన్ని సంస్థలు రాజ్యాంగం ప్రకారం తమ విధులను నిర్వర్తిస్తేనే ప్రజాస్వామ్యం ఉనికిలో ఉంటుందని తాము అభిప్రాయపడుతున్నామని వారు తమ లేఖలో పేర్కొన్నారు.ఇటీవల నుపుర్‌ శర్మ కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జేబీ పార్దీవాలా వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ లక్ష్మణరేఖను దాటారని మాజీలు తమలో లేఖలో విమర్శించారు.

న్యాయమూర్తుల వ్యాఖ్యలు తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయని తెలిపారు.

ఆ న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు.

పిటిషనర్‌ లేవనెత్తిన సమస్యతో సంబంధం లేకుండా ఉన్నాయన్నారు.అంతేగాక, న్యాయపరంగా నిబంధనలు అతిక్రమించేలా ఉన్నాయన్నారు.

ఈ కేసులో ఆమె తనపై నమోదైన కేసులన్నింటినీ కలిపి ఒకే చోటకు బదిలీ చేయాలని కోరారు.కానీ, అందులో ఆమెకు న్యాయం దక్కలేదు.

నుపుర్‌ కేసును ఎందుకు విభిన్నంగా చూశారన్నది ఇక్కడ ఎవరికీ అర్థం కాని విషయమన్నారు.ఇలాంటి ఘటనలు సుప్రీంకోర్టు గౌరవంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని మాజీ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

Telugu Supremenupur, Gujaratjudge, Jb, Suryakant, Nupur Sharma, Supreme-Politica

చౌకబారు ప్రచారం కోసం లేదా రాజకీయ ఎజెండా కోసం ఏమైనా చేస్తారా? అని సుప్రీంకోర్టు ఆక్షేపించింది.తన వ్యాఖ్యలకు గానూ దేశం మొత్తానికి నుపుర్‌ క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది.సుప్రీంకోర్టు ఆమెపై ఇంతగా ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని మాజీ న్యాయమూర్తులు, మాజీ అధికారులు తప్పు పట్టారు… లేఖపై సంతకాలు చేసినవారిలో బాంబే హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ షిటీజ్ వ్యాస్, గుజరాత్ హైకోర్టు మాజీ జడ్జి ఎస్ ఎం సోనీ, మాజీ ఐఏఎస్ అధికారులు ఆర్ ఎస్ గోపాలన్, ఎస్.కృష్ణకుమార్ , మాజీ డీజీపీలు ఎస్ పీ వాయిడ్ , బీఎల్ ఓహ్రా, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ చతుర్వేది, రిటైర్డ్ ఎయిర్ మార్షల్ ఎస్ పీ సింగ్ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube