సూపర్ స్టార్ మహేష్ బాబు (SSMB28) హీరోగా పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”SSMB28”. సర్కారు వారి పాట వంటి సూపర్ హిట్ సినిమాతో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ ( Mahesh Babu ) ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 28వ సినిమాను ప్రకటించి పూర్తి చేస్తున్నాడు.
ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మహేష్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.ఈ సినిమా ప్రకటించిన తర్వాత చాలా కారణాల వల్ల షూట్ వాయిదా పడుతూ వచ్చింది.మరి ఎన్నో నెలల వాయిదా తర్వాత ఈ ఏడాది సంక్రాంతి తర్వాత ఈ సినిమా షూట్ స్టార్ట్ అయ్యింది.

మరి వచ్చిన గ్యాప్ ను ఫిల్ చేయడం కోసం ప్రజెంట్ ఎటువంటి విరామం లేకుండా నిర్విరామంగా షూటింగ్ జరుగుతుంది.ఇదిలా ఉండగా కొద్దీ గంటల క్రితమే ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.ఈ సినిమా నుండి సూపర్ స్టార్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా సోషల్ మీడియాను షేక్ చేసాడు.
ఈయన లుక్ ఫ్యాన్స్ ను మాత్రమే కాదు అందరిని ఆకట్టుకుంది.

ఊర మాస్ లుక్ లో మహేష్ షేక్ చేయడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.ఫస్ట్ లుక్ తో పాటు ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్టు కూడా అనౌన్స్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు.కాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ ఇప్పట్లో ఉండదేమో అనుకున్న ఫ్యాన్స్ కు నిర్మాత నాగవంశీ (Producer Naga Vamsi) అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాడు.
ఈయన సోషల్ మీడియా వేదికగా నెక్స్ట్ అప్డేట్ సూపర్ స్టార్ కృష్ణ జయంతి రోజున మేలో రిలీజ్ చేస్తాం అని చెప్పి ఫ్యాన్స్ కు మరో తీపికబురు అందించారు.ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట అందరిని అలరిస్తుంది.







