షూటింగ్ లొకేషన్ లో చంద్ర మోహన్ అంతు చూస్తా అంటూ బెదిరించిన నిర్మాత

చంద్రమోహన్..

 Producer Insults Chandramohan At Shooting Location,chandramohan,relangi Narasimh-TeluguStop.com

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్ల నుంచి ఎంతో అనుకువగా గోడ కట్టినట్టుగా తన కెరియర్ ను నిలుపుకుంటూ వచ్చాడు.ఎన్నో వందల సినిమాల్లో నటించిన అనుభవం అతడిది.

అయితే చంద్రమోహన్ హీరోగా నటిస్తున్న కాలంలో జరిగిన ఒక సంఘటన ఇటీవల సోషల్ మీడియాలో బయటకు వచ్చి వైరల్ గా మారింది.సదరు సంఘటన తెలిసిన తర్వాత చంద్రమోహన్ ఇంతలా అవమాన పడాల్సి వచ్చిందా అంటూ పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఆ అవమానం ఏంటి ? ఆ సంఘటన ఏంటి ? అనే విషయం ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

రేలంగి నరసింహారావు గారి దర్శకత్వంలో చంద్రమోహన్ ఒక చిత్రంలో నటిస్తున్న సందర్భంలో జరిగిన సంఘటన ఇది ఆ సినిమాలో భానుప్రియ గుమ్మడి వంటి అనేకమంది భారీ తారాగణం ఉన్నారు.

అయితే రేలంగి వారికి చంద్రమోహన్ పొద్దున 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు షెడ్యూల్ ఇచ్చారంట.ఇక అదే సమయంలో వేజెళ్ళ సత్యనారాయణ గారు చంద్రమోహన్ ని హీరోగా పెట్టి జయసుధను హీరోయిన్ గా అనుకుని ఒక సినిమా తీయాలని భావించారు.

కానీ అప్పటికే రేలంగి వారికి టైం ఇచ్చి ఉండడంతో ఏం చేయాలో అర్థం కాక పరిగెత్తుకొని దర్శకుడు దగ్గరికి వచ్చారట.తనకు వచ్చిన ఆఫర్ గురించి కూడా దర్శకుడికి వివరించారట పొద్దున 9:00 వరకు మీ సెట్ లో ఉంటాను.ఏడు నుంచి ఎనిమిదిన్నర వరకు పొద్దున టైంలో అలాగే రాత్రి 9 తర్వాత సత్యనారాయణ గారి షూటింగ్ లో పాల్గొంటాను దానికి మీ పర్మిషన్ కావాలని అడిగారట.

Telugu Chandramohan, Satyanaraya-Movie

మరో మాట లేకుండా తప్పకుండా చేసుకోండి 9 నుంచి 9 వరకు ఎలాగూ నాకు టైం ఇచ్చారు కదా మిగతా టైం లో మీరు ఏం చేసుకుంటే నేను ఎందుకు అడ్డు చెప్తాను అని ఒప్పుకున్నారట.అయితే ఒక రోజు షూటింగ్లో ప్రొడ్యూసర్ కి ఈ విషయం తెలిసి ఎనిమిది గంటలకే విజయ గార్డెన్ లో చంద్రమోహన్, జయసుధలపై సన్నివేశం చిత్రీకరిస్తుండగా వెళ్లి గొడవ చేశారట.ఓయి చంద్రమోహన్ 10 నిమిషాల్లో నా షూటింగ్ లొకేషన్ లో లేకపోతే నీ అంతు చూస్తా అంటూ బెదిరించారట.

దాంతో షూటింగ్ స్పాట్లో చంద్రమోహన్ చాలా అవమానంగా ఫీల్ అయ్యారట.తొమ్మిదింటికి నీ సినిమా షూటింగ్ లో లేకపోతే నువ్వు ఏం చెప్పినా వింటాను ఇప్పుడు ఇది నీ టైం కాదు అని మొహం మీద చెప్పేసరికి నీళ్లు నమిలుకుంటు ప్రొడ్యూసర్ అక్కడి నుంచి వెళ్లిపోయారట.

ఇలా కొన్నిసార్లు తెలిసి తెలియని జ్ఞానంతో చాలామంది పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube