ప్రెసెంట్ మన టాలీవుడ్ లో సినిమా ఇండస్ట్రీ పరిస్థితి అంతగా అనుకూలంగా లేదు అనే చెప్పాలి.అలా అని సినిమాలు హిట్ అవ్వడం లేదు అని చెప్పడం లేదు కానీ.
సినిమా ఎంత హిట్ అయినా.ఓపెనింగ్స్ బాగానే వచ్చిన ఆ తర్వాత మాత్రం అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ రావడం లేదు.
దీంతో ఈ పరిస్థితులు చక్కబడే వరకు కొద్దీ రోజులు షూటింగులు వాయిదా వేయాలని స్వచ్చంధంగా నిర్ణయం తీసుకున్నారు.
అయితే ఈ నేపథ్యంలో దిల్ రాజు ఒక స్టేట్ మెంట్ ఇచ్చాడు.
ఈయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.అందరు షూటింగులు స్వచ్చందంగా ఆపేసిన నేపథ్యంలో ఈయన మాత్రం తాను నిర్మిస్తున్న బైలింగ్వన్ సినిమాను అసలు తెలుగు సినిమానే కాదు అని స్టేట్ మెంట్ ఇచ్చేసి అందరిని ఆశ్చర్య పరిచాడు.
కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి టాలీవుడ్ డైరెక్టర్ తో తన నెక్స్ట్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 66వ సినిమాను చేస్తున్నాడు.

ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.దిల్ రాజు భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నాడు.
మొన్నటి వరకు తెలుగు సినిమా అని చెప్పుకుంటూ తిరిగిన దిల్ రాజు ఇప్పుడు సడన్ గా ఇలాంటి స్టేట్ మెంట్ ఇవ్వడం కొద్దిగా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది.షూటింగ్ ఆపాలి అనే సమయానికి మాది తమిళ్ సినిమా తెలుగు కాదు సో షూటింగ్ యధావిధిగా జరుగుతుంది అని చెప్పి పెద్ద షాక్ ఇచ్చాడు.
దీని గురించే ఇప్పుడు అంతా చర్చించు కుంటున్నారు.తెలుగులో వారసుడు టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళ్ లో వరిసు అనే టైటిల్ తో తెరకెక్కుతుంది.