మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) లావణ్య త్రిపాఠి (Lavanya Tripati) లా నిశ్చితార్థ వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన విషయం మనకు తెలిసింది.ఇక వీరు నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.ఇక వరుణ్ తేజ్ పార్టీల గురించి నిర్మాత చిట్టిబాబు (Chitti Babu)వరుణ్ తేజ్ లావణ్యల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా చిట్టిబాబు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని నాగబాబు లావణ్య త్రిపాఠిన కోడలిగా చేసుకోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని తెలియజేశారు.

లావణ్య త్రిపాటి రాయల్ ఫ్యామిలీ(Royal Family) కి చెందిన అమ్మాయి.ఆమెకు కోట్ల ఆస్తులు ఉన్నాయి తనని లవ్ చేస్తే ఎవరూ తనకు అడ్డు చెప్పరన్న ఉద్దేశంతో వరుణ్ తేజ్ సైతం ఆమెతో చాలా తెలివిగా లవ్ ట్రాక్ నడిపారు.అమ్మాయి బాగుంది ఆమె ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ కూడా బాగుంది ఇంతకన్నా ఇంకేం కావాలి.
ప్రస్తుత కాలంలో కులమతాలకు ఏమాత్రం పట్టింపు లేదు అందుకే నాగబాబు(Nagababu) సైతం లావణ్య త్రిపాఠినీ తన ఇంటి కోడలుగా చేసుకోవడానికి ఏమాత్రం అడ్డు చెప్పలేదు అంటూ నిర్మాత చిట్టిబాబు ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక చిట్టిబాబు చేసిన వ్యాఖ్యలపై పలువురు మెగా అభిమానులు స్పందిస్తూ ఈయనని తప్పుపడుతున్నారు.ఈయన మాటలు ఎలా ఉన్నాయి అంటే లావణ్య త్రిపాటికి మంచి ఆస్తులు ఉన్నాయి కనుక ఆయన తనని లవ్ లో పడేసారని అందుకే మెగా ఫ్యామిలీ కూడా అడ్డు చెప్పలేదంటూ అర్థం వచ్చేలా ఉన్నాయి అంటూ మెగా అభిమానులు చిట్టిబాబు వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.ఇక నిహారిక(Niharika) గురించి కూడా ఈయన మాట్లాడుతూ నాకు ఆడపిల్లలు ఉన్నారు.
నేను ఆడపిల్లల తండ్రిని ఏ తండ్రి అయిన తన కూతురు అత్తారింట్లో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది కనుక నిహారిక గురించి తాను ఏమీ మాట్లాడదలచుకోలేదని తెలియజేశారు.







