మాజీ ఎమ్మెల్యే టిడిపి నేత వరదరాజు రెడ్డికి రాజకీయ సమాధి కట్టే వరకు తాను నిద్రపోనని ప్రొద్దుటూరు వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు.గతంలో భూమి ఆక్రమించుకోవడం కోసం అమాయకుడిని సజీవ దహనం చేసిన చరిత్ర వరదరాజు రెడ్డి అని అన్నారు.
ఇంతకాలం వయసుకు గౌరవం ఇచ్చి వరదరాజు రెడ్డిని చూసి చూడనట్టు వదిలేసానని ఇక సహించేది లేదన్నారు.పూర్తిగా పతనం చేసే వరకు తాను విశ్రమించేది లేదని రాచమల్లు ఘాటైన వ్యాఖ్యలు చేశారు.